'Power Play' Trailer: Tense action and thrills క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’

Power play trailer raj tarun s film is a crime thriller

vijay kumar konda, power play, power play motion poster, power play trailer, power play teaser, power play teaser raj tarun, power play new telugu movie, power play telugu movie, power play telugu movie teaser, power play teaser telugu, new telugu movies, new telugu movies 2020, new telugu movie teaser, new telugu trailers 2021, latest telugu trailers

Raj Tarun has acted in a thriller. Titled 'Power Play', the film is directed by Vijay Kumar Konda, whose previous outings such as 'Orey Bujjiga' were hardly of this genre. The director has teamed up with writer Nandhyala Ravi.

క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’

Posted: 02/04/2021 07:28 PM IST
Power play trailer raj tarun s film is a crime thriller

యువనటుడు రాజ్ తరుణ్‌ హీరోగా, విజయకుమార్‌ కొండా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పవర్‌ ప్లే’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలయ్యింది. ఒక్క‌ డైలాగ్‌ కూడా లేకుండా వచ్చిన ఈ ట్రైలర్‌ ఆసక్తి రేపుతోంది. మధునందన్‌, అజయ్‌, రాజారవీంద్ర, పూర్ణ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. లవ్‌, కామెడీ సినిమాలకు కామా పెట్టి "పవర్‌ ప్లే"తో క్రైమ్‌ థ్రిల్లర్‌ ట్రాక్‌ ఎక్కాడు హీరో రాజ్‌ తరుణ్‌. తన గత చిత్రం 'ఒరేయ్‌ బుజ్జిగా'ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టాడు.

విజయ్ కుమార్ కొండ ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో  పవర్‌ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి. ఇదిలా వుంటే రాజ్‌ తరుణ్‌ ఈసారి కూడా హీరోయిన్ తో లిప్ లాక్‌ సీన్ లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్‌ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు? రాజ్‌ తరుణ్‌ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే!.

ఇక ఈ పవర్‌ ప్లేలో హేమల్‌ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా కోటా శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్‌, దేవేష్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు రాజ్‌ తరుణ్‌ 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు' ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది. సురేష్‌ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ ‌స్కోర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని మనమాలి క్రియేషన్స్‌పై మహిథర్‌, దేవేష్‌ నిర్మిస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power play  raj tarun  Hemal  vijay kumar konda  Suresh Bobbli  Mahidhar  Devesh  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh