junior ntr emotional tweet on hari krishnas birthday మిస్ యూ నాన్నా: అన్నతో కలసి తారక్ ట్వీట్

Tarak and kalyan ram emotional tweet on hari krishnas 64th birthday

Hari Krishna, Birth day, Young tiger, NTR, Kalyan Ram, Emotional tweet, namdamuri fans, Tarak photos, Tarak tweets, Junior NTR Photos, Junior NTR tweets, emotional tweets, Entertainment, telugu movies, movies, tollywood

Tollywood Young Tiger Nandamuri Taraka Rama Rao akka Tarak posted a Emotional tweet on his Father, Actor and Politician Hari Krishna's Birthday along with his brother Kalyan Ram, being liked by namdamuri fans.

కల్యాణ్ రామ్ తో కలసి ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్..

Posted: 09/02/2020 08:55 PM IST
Tarak and kalyan ram emotional tweet on hari krishnas 64th birthday

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తండ్రి నందమూరి హరికృష్ణకు ఇవాళ ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి హరికృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని తలచుకుంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నందమూరి అభిమానులు షేర్ చేసుకోవడం, లైక్ చేయడంతో నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. 'ఈ అస్థిత్వం మీరు, ఈ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొన‌సాగే మా ఈ ప్ర‌స్థానానికి  నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌ల‌చుకునే అశ్రుక‌ణం మీరే' అంటూ నంద‌మూరి తారక రామారావు తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు.

హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. మిస్‌ యు నాన్న అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. తన అన్న నందమూరి కల్యాణ్‌రామ్‌తో పాటు తాను తన తండ్రిని స్మరించుకుంటున్నానని చెప్పాడు. 'మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటున్నాను... మిస్‌ యూ నాన్న' అంటూ నందమూరి కల్యాణ్ రామ్ కూడా పేర్కొన్నాడు. కాగా, 2018లో నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై తలకు, ఛాతీ భాగానికి బలమైన గాయాలు కావడంతో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hari Krishna  Birth day  Young tiger  NTR  Kalyan Ram  Emotional tweet  nandamuri fans  tollywood  

Other Articles