Mega daughter-in-law adopts elephant మెగా కోడలు ఉపాసన ఔదార్యం.. గజరాణిని దత్తత..

Hero ram charans wife upasana konidela adopts an elephant

Megapower star, ram charan, upasana kamineni, ram charan's family, Elephant, Nehru Zoo, Nehru Zoological park, Tollywood, movies, Entertainment

Upasana Kamineni, who turned a year older on July 20, 2020, celebrated the day by showing love towards animals and in fact even taking it to the next level. The wife of the mega powerstar came ahead and adopted an elephant from the Nehru Zoological Park in Hyderabad.

మెగా కోడలు ఉపాసన ఔదార్యం.. గజరాణిని దత్తత..

Posted: 07/21/2020 11:20 PM IST
Hero ram charans wife upasana konidela adopts an elephant

మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల ఔదార్యం మరోమారు బయటపడింది. మెగా కొడలి హోదాతో పాటు అపోలో గ్రూప్ సంస్థల వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమె తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన పుట్టిన రోజున ఏదో ఒక మంచి పని చేయాలని భావించే మహానుభావులు ఇంకా వున్నారు. ఈ మధ్యకాలం తన జన్మదినాన్ని పురస్కరించుకుని చాలా మందిలో సామాజిక సృహ కలుగుతోంది. అనాధ శరణాలయాల్లో అన్నదానాలు చేయడం, వృద్దాశ్రమాల్లో వస్త్రదానాలు చేసే సంఖ్య కాసింత పెరుగుతోంది.

ఈ క్రమంలోనే మెగా డాటర్ ఇన్ లా.. ఉపాసన కోణిదెల కూడా తన జన్మదినాన్ని పురస్కరించుకుని తధ్భిన్నమైన కార్యాన్ని చేపట్టారు. అమె ఏకంగా ఓ గజరాణిని దత్తత తీసుకున్నారు. నెహ్రూ జూపార్కులోని ఆడ ఏనుగు రాణి(82)ని సినీనటుడు రాంచరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ ఉపాసన దత్తత తీసుకున్నారు. సాయంత్రం జూకు చేరుకున్న ఆమె క్యూరేటర్‌ ఎన్‌.క్షితిజను సంప్రదించి జూలోని జంతువుల వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఆడ ఏనుగును దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు ఆ ఏనుగు పోషణ కోసం రూ.5 లక్షల చెక్కును క్యూరేటర్‌కు అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh