Samantha strong reply to haters goes viral విమర్శకులకు చెంపపెట్టులాంటి జవాబిచ్చిన సమంత

Samantha strong reply to haters goes viral on social media

samantha Akkineni, pooja hegde, pooja ego, pooja hedge insta account hacked, pooja hedge charecter, pooja hedge samantha, sam, twitter, samantha akkineni, samantha akkineni haters, samantha akkineni haters reply, samantha akkineni twitter, samantha akkineni vs pooja hegde, samantha akkineni pooja hegde war, pooja hegde instagram, social media, fan war, apology, tollywood, movies, entertainment

Samantha Akkineni gives strong reply to one of her fan and twitterite question on how she responds on her haters. Sam comments and her tweet goes viral on social media.

విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

Posted: 05/30/2020 01:48 PM IST
Samantha strong reply to haters goes viral on social media

సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె ఓ స్వప్నసుందరే. అనతికాలంలోనే అమెను ఇంతలా ఎదిగేలా చేసింది అమె అభినయమే కాదు ఔనత్యం కూడా అని చెప్పక తప్పదు, ఇక అణిగిమణిగి వుండే తత్వం కూడా అమెకు అడిషనల్ ప్లస్ పాయింట్. దీంతో పాటు ఎక్కడ అనుకువను దాటి, తన పరిమితి, పరిధి దాటి వెళ్లకుండా నిత్యం జాగ్రత్తపడే నూటికి నూరుపాళ్లు తెలుగింటి కోడలు.

అయితే అమె గురించి మరో హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా అకౌంట్లో ఓ అభ్యంతకర ట్వీట్ వెలువడింది. అయితే ఇది వెలువడిన తరువాత దీనిపై స్పందించిన పూజాహెగ్డే తనకు తెలియకుండా తన సోషల్ మీడియాలో పేజీలో ఎవరో హ్యాక్ చేసి సమంత గురించి పోస్ట్ పెట్టారని పూజా చెప్తుంది. ఈ విషయాన్ని సామ్ అభిమానులు మాత్రం తేలిగ్గా తసుకోవడం లేదు. పూజా తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా కూడా అది తప్పే.. అమె తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పిన విషయం కూడా నమ్మశక్యంగా లేదని.. ఈ విషయాన్ని వెలవరించిన విధానం కూడా అమె స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శించారు. దీంతో సమంతకు పూజ కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ పట్టుబట్టారు.

దీనిపై సమంత కూడా సైలెంట్ గా ఉంది. తన పని తాను చేసుకుంటుంది. ఈ విషయాన్ని అమె చాలా తేలిగ్గా తీసుకుంది. అయితే ఓ ట్విట్టర్ ఫాలోవర్ అమెను సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇలాంటి విమర్శకులకు మీరిచ్చే సమాధానం ఏంటి.? మీరెలా స్పందిస్తారని అడిగాడు. దీంతో అమె చాలా స్వీట్ గా సుతిమెత్తగా ఇచ్చిన జవాడు విమర్శకుల చెంపచెల్లుమనిపించేలా వుంది. తనను ద్వేషించే వాళ్లను చూస్తుంటే తనను మరింతగా మెరుగుపర్చుకునే అవకాశాన్ని ఇచ్చినట్టుగా భావించి అందుకోసం తాపత్రయపడతానని చెప్పింది. ప్రశంసలు, పోగడ్తలు తనను బద్ధకస్థురాలిగా మార్చేలా చేస్తాయని అమె చక్కని సమాధానం ఇచ్చింది. అందుకే విమర్శించే వాళ్లే తనకు మేలు చేస్తారని ట్వీట్ చేసింది సమంత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha Akkineni  pooja hegde  samantha  sam  twitter  social media  fan war  apology  tollywood  

Other Articles