PSPK26 – Pawan Kalyan Wakeel Saab Poster పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో

Pspk26 first single pawan kalyan vakeel saab maguva maguva song promo

Pawan Kalyan, Vakeel saab, pawan kalyan vakeel saab, Maguva Maguva Song Promo, pawan kalyan vakeel saab maguva song, pspk 26, pink remake, pink, Nivetha Thomas, nerkonda paarvai, Venu Sriram, #pspk26, movies, entertainment, tollywood

Presenting herewith the first single 'Maguva Maguva Song' Promo of the film 'Vakeel Saab'. Power Star Pawan Kalyan has been making his re-entry with this film after three years. The film is the official remake of Bollywood blockbuster 'Pink'.

పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో

Posted: 03/06/2020 09:14 PM IST
Pspk26 first single pawan kalyan vakeel saab maguva maguva song promo

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. తనను అనునిత్యం అదరించే అడపడచుల కోసం.. మరీ ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ కోసం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచి కానుకను అందించనున్నారు. మార్చి 2 ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు చిత్రం టైటిల్ ను కూడా కన్ఫాప్ చేసిన చిత్ర యూనిట్.. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కోసం నిరీక్షిస్తున్నారు.

తాను కూడా మార్చి 8 ఎప్పుడు వస్తుందా.? అని ఎదురుచూస్తున్నానని, తనతో పాటు ఫస్ట్ సింగిల్ కోసం ప్రేక్షకులు అందరూ నిరీక్షిస్తుంటరాని తనకు తెలుసునన్న ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్ థమన్.. ఆగలేని అభిమానుల కోసం ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ‘‘మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువా..? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా..’’ అంటూ సాగుతుంది.

సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు లిరికల్ సాంగ్ విడుదల చేయనుంది చిత్రయూనిట్.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మగువ మగువ’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ‘మగువ మగువ లోకానికి తెలుసు నీ విలువ.. మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా..’అంటూ కొనసాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు.. బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles