Aakaasam Nee Haddhura: Sky-high Teaser సూర్య ‘‘ఆకాశమే నీ హద్దురా.!’’ చిత్రం టీజర్

Suriya s aakaasam nee haddhu ra teaser released

Aakaasam Nee Haddhura, Aakaasam Nee Haddhura Teaser, aparna balamurali, jackie shroff, mohan babu, surya, Aakaasam Nee Haddhura, tollywood, movies, entertainment

The keenly awaited Aakaasam Nee Haddhura's teaser is out finally. The teaser takes off in the year 1984, with veteran Tollywood star Mohan Babu's voice explaining the extraordinary dream of an ordinary young man who dreamed to conquer the skies.

సూర్య ‘‘ఆకాశమే నీ హద్దురా.!’’ చిత్రం టీజర్

Posted: 01/07/2020 08:49 PM IST
Suriya s aakaasam nee haddhu ra teaser released

సూర్య హీరోగా నటిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా!’ సినిమా టీజర్‌ విడుదలైంది. ‘జేబులో రూ.6 వేలు పెట్టుకుని.. విమానాల కంపెనీ పెడతానని ఒకడొస్తే ఎవడ్రా ఈ పిచ్చోడని లోకం వాడిని చూసి నవ్వింది’ అనే మోహన్ బాబు డైలాగ్ తో ఆరంభమైన టీజర్ లో సూర్య నాలుగు దశాబ్దాల క్రితం ఓ యువకుడిలా అప్పటి డ్రెసింగ్ లో కనిపించడంతో పాటు ఏదో సాధించాలన్న కసి తన కళ్లలో కనిపిస్తోంది. అయితే మోహన్ బాబు డైలాగ్ యువకుడు సాధించాలని అనుకుంటున్నదేంటో రివీల్ చేసింది. అదే ఎయిర్ లైన్‌ సర్వీస్‌.

టీజర్ ప్రారంభంటో సూర్య ఓ సాధారణ యువకుడిగా కనిపించారు. అయితే అసాధారణమైన దాన్ని సాధ్యం చేయాలన్న పట్టుదల వున్న యువకుడిలో వుండే కసి, పట్టుదల మాత్రం అతని చూపుల్లో, హావభావాల్లో కనిపించాయి. అయితే ఎయిర్ లైన్స్ సర్వీసెస్ సాధించడంలో సూర్య ఎదుర్కొన్న ఆటుపోట్లను టీజర్లో చూపించారు. నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఓ సాధారణ వ్యక్తి అసాధారణమైన కల.. అంటూ ప్రచార చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు.

సూర్య కొత్త లుక్ లో విభిన్నంగా కనిపించారు. సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురళి, జాకీ ష్రాఫ్‌, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య, గుణీత్‌ మొన్గా నిర్మాతలు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. సినీ ప్రముఖులు వెంకటేష్‌, ప్రభాస్‌, సమంత, నందినిరెడ్డి, సందీప్‌ రెడ్డి వంగా టీజర్ ను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aparna balamurali  jackie shroff  mohan babu  surya  Aakaasam Nee Haddhura  teaser  tollywood  

Other Articles