Ala Vaikunthapurramuloo clears censor formalities అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సెన్సార్ పూర్తి..!

Ala vaikunthapurramuloo clears censor without a single cut

#AlaVaikunthapurramuloo, samajavaragamana video song, Allu Arjun, Pooja Hegde, Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Samuthirakani, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul Ramakrishna, Harsha Vardhan, Trivikram, Thaman S, Ala Vaikunthapurramuloo news, Ala Vaikunthapurramuloo censor report, Ala Vaikunthapurramuloo latest updates, Ala Vaikunthapurramuloo latest news, Tollywood, movies, entertainment

Stylish Star Allu Arjun's new movie Ala Vaikunthapurramuloo has cleared Censored today, Allu Arjuns movie completed all the censor hurdles and the film passed without a single cut.

అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సెన్సార్ పూర్తి..

Posted: 01/03/2020 10:01 PM IST
Ala vaikunthapurramuloo clears censor without a single cut

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్దంగా వుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవాళ చిట్టచివరిదైన పనిని కూడా ముగించేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఒక్క సింగిల్ కత్తెర కూడా పడకుండా బయటకు వచ్చింది.

అయితే, ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఇక ఈ చిత్ర నిడివి మొత్తం 2 గంటల 36 నిమిషాల నిడివితో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రోజుతో థియేటర్ల గొడవ కూడా పూర్తవుతుందని అంటున్నారు.  ఈరోజు సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో 'టబు' కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్‌ స్వరాలు అందించిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టబు, నివేదా పేతురాజు, సుశాంత్‌, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, నవదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ పతాకంపై, ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh