Allu Arjun reunites with director Sukumar for AA20 అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ చిత్రం ప్రారంభం

Allu arjun to romance rashmika mandanna in sukumar s next film

AA20, Allu Arjun, Allu Arjun actor, Allu Arjun films, Allu Arjun news, Rashmika Mandanna, South actor Allu Arjun, Sukumar, Telugu Films, Telugu star Allu Arjun, Vijay Sethupathi, DSP, Mythri movie makers, tollywood, Movies, Entertainment

Tollywood Stylish star Allu Arjun will be coming together with Rashmika Mandanna for filmmaker Sukumar's next. The film is tentatively named AA20 and it will see Arjun and Mandanna romancing on screen for the first time.

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ చిత్రం ప్రారంభం

Posted: 10/30/2019 07:23 PM IST
Allu arjun to romance rashmika mandanna in sukumar s next film

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత యేడాదిన్నరకు పైగా ఖాళీగా ఉన్న అల్లు అర్జున్.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో  ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమా డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది.  ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇక అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 20వ సినిమాను చేయనున్నాడు.

తాజాగా ఈ సినిమాకు ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ సరసన  రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్‌లో ఇది 11వ సినిమా. ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు అల్లు అర్జున్ నాన్న ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దేవుడి పటాలపై క్లాప్ కొట్టారు.

ఈ సినిమా స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి సుకుమార్‌కు అందజేశారు.  ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లోతెరకెక్కేబోయే ఈ సినిమా  ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం బన్ని పూర్తిగా మేకోవర్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే టైటిల్ విషయంలో సుకుమార్ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. ‘ఆర్య’,ఆర్య2’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AA20  Allu Arjun  Rashmika Mandanna  Sukumar  Vijay Sethupathi  DSP  Mythri movie makers  tollywood  

Other Articles