Sye Raa video song trends online చిరంజీవి ‘సైరా’ టైటిల్ వీడియో సాంగ్ ట్రెండింగ్..!

Sye raa title video song trends on social media

Sye Raa Narasimha Reddy, Sye Raa Title song, sye raa video song, sye raa video song, sye raa song trending online, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Tollywood, Entertainment, Movies

Tollywood Megastar Chiranjeevi’s upcoming historical-drama Sye Raa Narasimha Reddy, film unit release title video song, which goes trending on social media in top ten.

చిరంజీవి ‘సైరా’ టైటిల్ వీడియో సాంగ్ ట్రెండింగ్..!

Posted: 10/01/2019 11:00 AM IST
Sye raa title video song trends on social media

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటిస్తున్న చారిత్రాక చిత్రం ‘సైరా’ సినిమా విడుదలకు మరికోన్ని గంటల సమయం మాత్రమే వుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ విడుదలతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. అయితే తెలుగుతో పాటు దక్షిణాది బాషలతో పాటుగా అటు హిందీలోనూ ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో యావత్ భారత దేశ ప్రేక్షకులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ వేచిచూస్తున్నారు.

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపోందిన ఈ చిత్రంపై ఇటు మోగా ఫ్యాన్స్ లనూ అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తోడు చిరంజీవి చిత్రం, అందులనూ చారిత్రక నేపథ్యం వున్న చిత్రం కావడంతో అటు ఫ్యామిలీ అడియన్స్, ఇటు దేశభక్తిపరులు కూడా చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని వేచి చూస్తున్నారు.

కాగా, గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు తన ప్లాన్ ప్రకారం అన్ని చేస్తూనే వుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది,  నరసింహారెడ్డి గొప్పతనాన్ని తమన్నా, నయనతార కీర్తిస్తున్న సందర్భంలో సాగే ఈ పాటను భారీస్థాయిలో చిత్రీకరించారు. కొరియోగ్రఫీ కూడా కళ్లుచెదిరేలా ఉంది.

సాంగ్ సోషల్ మీడియా రికార్డులు బద్దలు కొడుతూ.. టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. ‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌరా.. ఉయ్యాల వాడ నారసింహుడా.. చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా.. రేనాటి సీమ కన్న సూర్యుడా.. నింగి శిరసు వంచి.. నమోస్తు నీకు అనగా.. నవోదయానివై జనించినావురా.. ఓ సైరా… ఓ సైరా…’ అంటూ సాగుతుంది. ఈ పాటను సిల్వర్ స్ర్కీన్ పై డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ లో వింటే రోమాలు నిక్కపోడుచుకోవడం ఖాయం.

అంటూ సాగే ఈ పాట వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ ఖాయం. ‘దాస్యాన జీవించి ఉండటం కన్నా చావెంత మేలంది నీ పౌరుషం’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి. అమిత్ త్రివేది కంపోజిషన్ లో … సునీధీ చౌహాన్, శ్రేయాఘోషల్ ఈ పాటను పాడారు. పాటలో చూపించిన సన్నివేశాలు… అత్యున్నతంగా ఉన్న మూవీ స్టాండర్డ్స్ ను చెబుతున్నాయి. రామ్ చరణ్ నిర్మాణంలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  video title song  trending online  social media  Chiranjeevi  Ram Charan  Tollywood  

Other Articles

 • Darling prabhas a very happy birthday

  డార్లింగ్ జన్మదిన సంబరాలు..

  Oct 23 | అరడుగుల అజానుభావుడు కృష్ణంరాజు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మన తెలుగు నేల పై సుస్వరరాగలను వెదజల్లుతున్నా శివాగమి ముద్దుబిడ్డ ప్రభాస్... నటనలో వైవిధ్యం.. చలనచిత్రానికై ఏకాగ్రత..పట్టువిడని తనం.. ఆదనపు ఆకర్షణలు.. ఏ పాత్రలోనైన ఇమిడిపోయే... Read more

 • Komaram bheem jayanti rrr buzzing

  కొమరం భీం జయంతి - RRR సందడి

  Oct 22 | నిజాం సర్కార్  నిరంకుశతత్వాన్నికి    ఎదురుతిరిగి నిలబడిన మన తెలంగాణ వీరుడు కొమరం భీం.. అటువంటి చరిత్రకారుడు చరిత్ర వింటేనే  మది  పులకిస్తుంది . మరి కళ్ళకు కు  కట్టినట్టు  దర్శనం ఇస్తే మన  రెండు... Read more

 • Samantha akkineni shares an adorable picture of hubby naga chaitanya with their pet dog

  అందాల మనం ప్రేయసి - శునకాల ప్రేయసి

  Oct 22 | మనకందరికీ  ఎంతో ప్రియమైన సుపరిచితురాలైనా  మన తెలుగు బంగారపు బొమ్మ ....అక్కినేని వంశ రారాణి  మన సమంతా ..చైతన్య సమంత జంటను  చూసి ముచ్చటపడని  వారున్నారంటే  అతిశయోక్తే  మరీ  ..అంతగా ఇమిడిపోయారు ఇరువురు మనం... Read more

 • Megastar chiranjeevi meets vice president m venkaiah naidu in new delhi

  ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

  Oct 16 | మెగాస్టార్ చిరంజీవి చిత్రం రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన స్వయంకృషితో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తరుణంలో అనేక అటుపోట్లను చూసినా.. ఏ రోజు తన చిత్రాన్ని వీక్షించాలని ఏ రాజకీయ నేతనూ కోరలేదు.... Read more

 • Housefull 4 s bhoot song has nawazuddin siddiqui chanting alia bhatt

  హౌజ్ ఫుల్ 4 నుంచి ‘హాంఫట్.. అలియా భట్’ వీడియో సాంగ్..

  Oct 16 | ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ విడుదలకు సిద్ధమవుతుంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా నటించగా.. ఫర్హాద్... Read more

Today on Telugu Wishesh