Valmiki crosses Rs 21 crore mark గద్దలకొండ గణేష్ బద్దలుకొట్టిన వరుణ్ తేజ్ రికార్డులు..

Gaddalakonda ganesh 10 day box office collection

Gaddalakonda Ganesh,valmiki, Gaddalakonda Ganesh box office collection, Gaddalakonda Ganesh 5 days collection, Gaddalakonda Ganesh distributors share, varun tej, Gaddhala Konda Ganesh, Gaddalakonda Ganesh total worldwide collection, 10day collections, pooja hedge, Hairsh Shanker, Tollywood, Movies, Entertainment

Varun Tej's Gaddalakonda Ganesh has collected Rs 20.84 crore gross share in both andhra pradesh and telangana states, Worldwide box office collections figure in 10 days may be out tommorrow.

గద్దలకొండ గణేష్ బద్దలుకొట్టిన వరుణ్ తేజ్ రికార్డులు..

Posted: 09/30/2019 09:20 PM IST
Gaddalakonda ganesh 10 day box office collection

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేశ్' తన మారు వసూళ్లను రాబట్టుకోవడంలో విజయవంతమైంది. ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజునే పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, పది రోజుల్లోనే మంచి వసూళ్లను సాధించింది.

భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు చూపిస్తూ వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్న చిత్రంగా నిలిచింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా తొలి పది రోజుల వ్యవధిలో 7.78 కోట్ల షేర్ ను .. సీడెడ్ లో 3.53 కోట్లు .. వైజాగ్ లో 2.51కోట్లు .. తూర్పుగోదావరిలో 1.63 కోట్లు .. పశ్చిమ గోదావరిలో 1.41 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక కృష్ణా జిల్లాలో 1.40 కోట్లు .. గుంటూరులో 1.72 కోట్లు .. నెల్లూరులో 86 లక్షల షేర్ ను రాబట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఈ 10 రోజుల్లో 20.84 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తానికి సరైన సమయంలో వచ్చి వరుణ్ తేజ్ గట్టి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వచ్చేనెల 2వ తేదీ నుంచి 'సైరా' రంగంలోకి దిగుతోంది గనుక, థియేటర్ల సంఖ్య .. వసూళ్లు భారీగా తగ్గే అవకాశం వుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej  Gaddhala Konda Ganesh  10day collections  pooja hedge  Hairsh Shanker  Tollywood  

Other Articles