RDX Love Movie Teaser Hits 2 5 Million Plus Views అమ్మో పాయల్.! నీ బూతు పురాణానికి భారీ రెస్పాన్స్.!!

Rdx love movie teaser hits 2 5 million plus views

rdx love teaser talk, rdx love teaser review, RDX Love Teaser, payal rajput rdx love, payal rajput condom ad, Payal Rajput, RDX Love, Teaser, payal rajput, Youtube, sensation, 2.5+ million views, Tollywood

RX 100 Heroine Payal Rajput had created sensation on social media gaint Youtube with her upcomming movie RDX Love Movie Teaser, which Hits 2.5 Million Plus Views.

అమ్మో పాయల్.! నీ బూతు పురాణానికి భారీ రెస్పాన్స్.!!

Posted: 08/31/2019 08:35 PM IST
Rdx love movie teaser hits 2 5 million plus views

నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రం ఒక వెరైటీ ప్రేమకథగా రూపొంది బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పాటు అటు యువత ఇటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరించి మంచి సక్సెస్ సాధించిందీ చిత్రం. ఇక ఆ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్, తొలి సినిమానే సూపర్ హిట్ కొట్టడంతో, వరుసగా అవకాశాలను దక్కించుకుంది. అయితే తనకు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పాయల్,

ప్రస్తుతం వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలతో పాటు హుషారు మూవీ ఫేమ్ తేజస్ కంచర్లతో కలిసి RDX లవ్ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి, ఒకవేళ తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి’, ‘మీరెప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా’ వంటి డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ టీజర్ ను ఎక్కువగా అడల్ట్ కంటెంట్ తో నింపేశారు.

ఇక టీజర్ లో పాయల్ అందాల ఆరబోతకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ టీజర్ ప్రస్తుతం రెండు మిలియన్లకు పైగా వ్యూస్ తో అదరగొడుతూ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. వీకే నరేష్, నాగినీడు, ఆదిత్య మీనన్, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకు పరశురామ్ డైలాగులు రాయాగా, రథన్ సంగీతం సమకూర్చారు. గణేష్ స్వామి సినిమాటోగ్రఫీ అందించారు. సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RDX Love  Teaser  payal rajput  Youtube  sensation  2.5+ million views  Tollywood  

Other Articles