This is Sye raa Final Schedule, says Ram Charan ‘సైరా’ సెట్ లో అగ్నిప్రమాదంపై రాంచరణ్ ఏమన్నారంటే..

Sye raa sets worth rs 2 crore gutted in massive fire

Ram Charan, Chiranjeevi, Sye Raa Narasimha Reddy, konidela productions, kokapet farm house, fire accident in sye raa set, ram charan facebook, Sye Raa,Fire on Sye Raa sets,Fire on Sye Raa shooting spot,Sye Raa Narasimha Reddy,Fire megastar Chiranjeevi farmhouse,Fire accident on Sye Raa set,Ram charan,Where is Chiranjeevi farmhouse, Chiranjeevi,Director Surender Reddy, movies, entertainment, tollywood

"Unfortunately, a fire broke out on our ‘Sye Raa’ set in Kokapet earlier this morning. Thankfully, everyone in the team is safe and no one is hurt. We are really looking forward for our last schedule to finish!!," Ram Charan posted on Facebook.

‘సైరా’ సెట్ లో అగ్నిప్రమాదంపై రాంచరణ్ ఏమన్నారంటే..

Posted: 05/03/2019 09:47 PM IST
Sye raa sets worth rs 2 crore gutted in massive fire

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ అటు నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్లో.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న రెండో చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో రూ. 2 కోట్ల మేర అస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ ఘటనపై రాంచరణ్ తేజ్ తన ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.  ‘దురదృష్టవశాత్తు ‘సైరా’ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన కోకాపేట్‌లో చోటుచేసుకుంది. అదృష్టం బాగుండి ఈ ఘటనలో చిత్రబృందంలోని ఎవ్వరికీ ఏమీ కాలేదు.

అగ్ని ప్రమాదం అనగానే కాసింత అందోళనకు గురైనా.. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నాను. త్వరలో ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తిచేయాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తు్న్నారు.

ఈ చిత్రంలో భారీ తారాగణం వున్న విషయం తెలిసిందే. నటనాభినేత్రి నయనతార.. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రను పోషిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire accident  sye raa set  ram charan  facebook  konidela productions  tollywood  

Other Articles