Shakeela: Richa Chadha is Completely Covered in Gold ‘షకీలా’ ఫస్ట్ లుక్ లో రిచా చద్దా వెర్రీ హాట్

Shakeela first poster richa chadha looks bold fearless and fierce as shakeela

shakeela, Shakeela first look, Shakeela biopic, Shakeela richa chadha, richa chadha bold look, Richa Chadha, publicity stunt, latest movie news, mollywood, bollywood, kollywood, tollywood, movies, entertainment

Richa Chadha will soon be seen in the movie Shakeela, the film is based on the life of popular south star Shakeela. The first poster for the film just released take a look here.

షకీలా’ ఫస్ట్ లుక్ వెర్రీ హాట్: రిచా చద్దా జీవించిందా..

Posted: 11/20/2018 07:12 PM IST
Shakeela first poster richa chadha looks bold fearless and fierce as shakeela

దక్షిణాది ప్రేక్షకులలో మరీముఖ్యంగా కుర్రకారు గుండెలను పిండేసిన శృంగార తార షకీలా సినిమా విడుదల అవుతుందంటే ఇప్పటికీ అ క్యాటగిరికి చెందిన పురుషపుంగములు క్యూలో నిలబడి మరీ సినిమాను అస్వాదిస్తారు. ఎంత అదరణ లేకపోతే షకీలా ఏకంగా 250 చిత్రాల్లో నటించి తన సత్తాను చాటుతుంది. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడిన ... చివరికి శృంగార తార‌గానే మిగిలిపోయింది.

అయితే అమె జీవిత కథనే సినిమాగా తీస్తే.. ఇక ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో చెప్పనవసరం లేదు. తాజాగా అమె సినిమాకు సంబంధించిన ఇవాళ పస్ట్ లుక్ విడుదలైంది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి రెస్సాన్స్ అదిరిపోయింది. హీరోయిన్‌గా ఇండస్ట్రీలో వెలుగొందడానికి వచ్చిన షకీలా శృంగార తారగా ఎలా మారింది? ఆమె జీవితం వెనుకున్న చీకటి కోణం ఏమిటన్నదే షకీలా బయోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్రజీత్ లంకేశ్.

ఈ చిత్రంలో షకిలా ప్రాతను బాలీవుడ్ నటి రిచా చద్దా పోషిస్తుంది. మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై షకీలా ప్రేమికుడు అర్జున్ పాత్ర‌లో కనిపించనున్నారు. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘షకీలా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో షకీలా పాత్రధారి రిచా చద్దా నగ్నంగా ఒంటిపై నగలతో తన శరీరాన్ని కప్పి బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫస్ట్ లుక్‌కి బోల్డ్ అండ్ ఫియర్ లెస్ అనే క్యాప్షన్ ఇచ్చింది రిచా. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. 2019 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘షకీలా’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles