మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ కి 'ఒక మనసు' సినిమా తో పరిచయం అయ్యి అచ్చమైన తెలుగు అమ్మాయి గా చీర కట్టులో అందరి మనసుల్ని దోచుకుంది కొణిదెల నిహారిక. యూత్ లో నిహారికకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. వాళ్లంతా కూడా ఆమె నుంచి రానున్న సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్' రూపొందింది. సుమంత్ అశ్విన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కొత్త కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.
షూటింగ్ ముగించుకుని బయల్దేరుతోన్న నిహారిక దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. తాను ఓ యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినట్టు చెప్పి .. 'సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ విషయం బాగా వైరల్ అవుతోంది .. దాని గురించి చెబుతారా?' అని అడుగుతాడు. దాంతో .. "నా పెళ్లి గురించి మీకెందుకయ్యా .. ఎవరిని చేసుకుంటుంది .. ఎప్పుడు చేసుకుంటుంది .. చూస్తే షాక్ అవుతారు .. షేక్ అవుతారు అంటూ రాస్తారు. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?" అంటూ కోపాన్ని ప్రదర్శించింది. తాను అడిగేది 'హ్యాపీ వెడ్డింగ్' మూవీ గురించి అని ఆ వ్యక్తి అనడంతో వెంటనే శాంతిస్తూ .. "సారీ .. సారీ .. 'హ్యాపీ వెడ్డింగ్' ట్రైలర్ ఈ నెల 30 వ తేదీన రిలీజ్ అవుతుంది .. ఆ రోజునే సినిమా రిలీజ్ ఎప్పుడనేది చెబుతాను .. బై' అంటూ వెళ్లి పోతుంది'. ఆ రోజున ఉదయం 10 గంటల 35 నిమిషాలకి ఈ సినిమా ట్రైలర్ ను వదలనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more