janhvi debut film dhadak trailer unveiled శ్రీదేవి కూతరు జాన్వీ.. ‘ధడక్’ ట్రైలర్ చూశారా..!

Sridevi s daughter janhvi debut film dhadak trailer unveiled

Dharma, Dharma Productions, Dhadak, dhadak trailer, official trailer, Janhvi Kapoor, jhanvi kapoor, Ishaan Khatter, Ishaan, Sairat, Marathi, Remake, Adaptation, Music, Zingaat, Zinghat, Karan Johar, Karan, Zee Studios, Bollywood, movies, entertainment

Film maker Boney kapoor and Legendary actress Sridevi's daughter Janhvi makes her debut in the Hindi film industry with Dhadak.. the film unit releases the official trailer of the film.

శ్రీదేవి కూతరు జాన్వీ.. ‘ధడక్’ ట్రైలర్ చూశారా..!

Posted: 06/11/2018 03:22 PM IST
Sridevi s daughter janhvi debut film dhadak trailer unveiled

దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ వెండతెరను ఏలి.. అతిలోక సుందరిగా ఖ్యాతిపోందిన దివంగత నటి శ్రీదేవి తనయ కూడా అమెలా అభినయం చేయడం నేర్చేసుకుందని సినీవర్గాలు అంటున్నాయి. జాన్వీ నటించిన ‘దఢక్‌’ చిత్రంతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన సినీ జీవిత అదృష్టాన్ని పరీక్షించుకోనున్న జాన్వికి కొందరు సూచనలు చేస్తుండగా, అభిమానులు మాత్రం అసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇవాళ చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేయడంతో శ్రీదేవిలా పేరుతెచ్చుకుంటుందని సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు.

మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్ గా రాబోతోందని చిత్రబృందం ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కథానాయకుడిగా నటించాడు. ట్రైలర్ లో ఇషాన్.. జాన్వికి ప్రపోజ్‌ చేయాలనుకుంటాడు. దాంతో రణ్ బీర్‌, కత్రినా నటించిన ‘అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ’  సినిమాలోని ‘తూ జానెనా’ పాట పాడతాడు. అది విని జాన్వి..‘ఇంగ్లీష్‌ వచ్చన్నావ్ గా..ఇంగ్లీష్‌ పాట పాడు’ అంటుంది.

దాంతో ఇదే పాటను అంగ్లంలోకి అనువదించి పాడి ఆమె మనసు గెలుచుకుంటాడు. జాన్వి..ఇషాన్ కు ఐలవ్యూ చెబితే..ఇందుకు ఇషాన్‌ ‘సిగ్గుగా ఉంది’ అనడం నవ్వులు పూయిస్తోంది. జాన్వికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రంలో మరాఠీ చిత్రం సైరాట్‌ క్లైమాక్స్ నే ఇందులోనూ చూపిస్తారా? లేక ఏవన్నా మార్పులు చేశారా? అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles