‘శమంతకమణి’ తర్వాత యువ కథానాయకుడు సుధీర్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. బాలీవుడ్ నటి అదితి రావు హైదరి కథానాయిక. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.
కాగా తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దీన్ని సుధీర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా టీజర్. కచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘సినిమా సాహిత్యం బతికే ఉంటాయ్’ అంటూ నటుడు నరేష్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘సాహిత్యం అన్నావు ఓకే.. కానీ సినిమా?.. హహ్హ హ్హ’ అని సుధీర్ నవ్వారు.
‘సో.. సినిమాలే డర్టీయా? మిగతా ప్రపంచం మొత్తం క్లీన్నా?’ అని అతిథి.. సుధీర్‌ను ప్రశ్నించారు. ‘నేను అలా చెప్పలేదు. ఈ అందం అంతా మెల్లమెల్లగా పోతుంది. చర్మం ముడతలు పడి, పళ్లు ఊడిపోయి, కాళ్లు వంగిపోయి, జుట్టు రాలిపోయి.. ఈ ముఖం వెనకాల వేరే ఒకళ్లు ఉన్నారు. ఒక వ్యక్తిత్వం.. అది నిజమైన నవ్వు, నిజమైన సమీరా. నాకు ఆ నిజమైన మనిషి కావాలి’ అని సుధీర్‌బాబు వివరించారు. ‘నేను కూడా కెరీర్ కోసం, సక్సెస్ కోసం కాంప్రమైజ్ అయ్యానంటావా?’ అంటూ అదితి డైలాగ్ తో ముగిసే టీజర్ ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలిస్తుంది.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more