మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నట విశ్వరూపానికి ప్రతీకగా నిలిచిన చిత్రం రంగస్థలం.. సుకుమార్ దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంత చేసుకుని ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజల అభిమానుల అదరణను పోందుతూ.. చిత్రం విడుదలైన నాలుగు రోజుల వ్యవధిలోనే వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక 150 కోట్ల రికార్డును దాటివేసేందుకు రెడీ అవుతుంది. బాహుబలి తరువాత అంతటి వేగంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా టాలీవుడ్ లో రికార్డులను అందుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మంచి వసూళ్లను సాధిస్తున్న రంగస్థలం మున్ముందు మరిన్ని రికార్డ్ లు తిరగరాయటం ఖాయమని మెగా పవర్ స్టార్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాలలో తొలి నాలుగు రోజుల్లో రూ. 43.78 కోట్ల షేర్ ను రాబట్టడగా, ఇక ఓవర్ సీస్ లో ఇప్పటికే ఈ సినిమా 2.45 మిలియన్ డాలర్లను రాబట్టేసింది. ఇక అటు ఆస్ట్రేలియాలో కూడా రంగస్థలం హవా కొనసాగుతుంది.
ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాలలో పద్మావత్ తర్వాత ఆస్ట్రేలియాలో ఎక్కువ వసూళ్ళు రాబట్టిన చిత్రం రంగస్థలం అని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. నాన్ బాహుబలి చిత్రాలలో ఇప్పుడు రంగస్థలమే టాప్ కలెక్షన్లను రాబట్టడంతో నెంబర్ వన్ గా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. 1980ల కాలంలో జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్.. చిట్టిబాబు గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. చరణ్ కెరీర్ లోనే రంగస్థలం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా తన ప్రతిభా పాటవాలకు కొలమానంగా ఈ సినిమాను సెట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more