Chitralahari Bar Fully Loaded with Entertainment | చిత్రలహరి బార్.. హీరోలు మారిన థీమ్ ఒక్కటే!

Chitralahari movie based on bar

Sai Dharam Tej, Chitralahari, Chitralahari Bar, Chitralahari Movie, Chitralahari Movie Theme, Director Kishore Tirumala

Sai Dharam Tej Replaces Nani In Chitralahari Movie, Chitralahari a Bar Fully Loaded with Entertainment.

చిత్రలహరిలో సాయి ధరమ్ తేజ్.. థీమ్ అదేనంట!

Posted: 02/28/2018 04:22 PM IST
Chitralahari movie based on bar

ఒక హీరో కోసం కథను తయారు చేసుకుని అది కుదరకపోతే మరో హీరోతో చేసిన సందర్భాలు టాలీవుడ్ లో అనేకం. చివరకు హీరోకు తగ్గట్లు స్టోరీలో మార్పులు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి.

అయితే యంగ్ టాలెంటెడ్ దర్శకుడు కిషోర్ తిరుమల తన తర్వాతి చిత్రం విషయంలో మాత్రం అలాంటివేం చేసేందుకు సిద్ధంగా లేడంట. అందుకు కారణం హీరో ఎవరైనా ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశం కావటమే. చిత్రలహరి... ఆ పేరుతో ఉండే ఓ బార్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

తొలుత నాని ఈ సినిమా చేయాల్సి ఉంది. తర్వాత శర్వానంద్ తో అనుకున్నారు. కానీ, ఇద్దరు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఈ సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నారంట. దీనిపై అధికారిక ప్రకటన, మిగతా కాస్టింగ్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles