RGV God Sex and Truth Land in Legal Troubles | వర్మ కొట్టాడంటున్న కడప కుర్రాడు.. చిక్కుల్లో ’సె*‘ వీడియో

Varma gst in trouble

Ram Gopal Varma, God, Sex and Truth, P Jayakumar, Plagiarize, GST Book, God Sex Truth Book, Legal Trouble, MM Keeravani

God, Sex and Truth in Legal Trouble. After watching trailer Writer P Jayakumar alleges that RGV Copied his GST Book. The film starring Mia Malkova tells why she chose the world of adult.

కాపీ వివాదంలో వర్మ జీఎస్టీ వీడియో

Posted: 01/17/2018 12:44 PM IST
Varma gst in trouble

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ పేరిట వర్మ విడుదల చేయబోతున్న వీడియోకు చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. పీ జయకుమార్ అనే రచయిత తన జీఎస్టీ నుంచి కాపీ చేసి వర్మ చిత్రాన్ని తీస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. ఇంతకీ ఈ జయకుమార్ ఎవరో కాదు.. సర్కార్ 3 చిత్రానికి కథ అందించిన వ్యక్తి కావటం విశేషం. కపడకు చెందిన కుర్రాడు.

ట్రైలర్ చూసిన తర్వాత స్పందించిన జయకుమార్ తన రచనను వర్మ కాపీ కొట్టాడని చెబుతున్నాడు. జీఎస్టీ పేరిట (గాడ్ సెక్స్ ట్రూత్) పుస్తకాన్ని రాసి వర్మ రివ్యూ కోసం పంపించా. కానీ, ఆయన దానిని కాపీ చేసేశారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చూపించారు. ఈ విషయంపై న్యాయ చర్యలకు కూడా సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, దీనిపై వర్మ స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" . ‌.సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం అని చెబుతూ చిన్న బిట్ ను వదలిని వర్మ.. జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ విమియో ఛానల్ లో విడుదలచేయబోతున్నట్లు ప్రకటించాడు. సీనియర్ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించటం విశేషం.

 

Jayakumar GST

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles