బాలీవుడ్ లో మరో గ్రాండియర్ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మహారాణి పద్మావతి కథతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `పద్మావతి`. ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇప్పటిదాకా ఈ చిత్ర ప్రధాన తారగణ లుక్కులను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
మొత్తం విజువల్ తోనే మాయ చేసేందుకు బన్సాలీ ప్రయత్నించాడు. ఇవాళ విడుదలైన ట్రైలర్‌లో ప్రధాన పాత్రల ఆహార్యాభినయాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.రాజ్‌పుత్ వంశస్థుల ఖ్యాతిని వివరిస్తూ ప్రారంభమైన ఈ ట్రైలర్ చివర్లో పద్మావతిగా దీపికా పదుకునే చెప్పిన `రాజ్‌పుత్‌ల ఖడ్గంలో ఎంత శక్తి ఉందో.. అంతే శక్తి రాజ్‌పుత్ రాణుల గాజుల్లో కూడా ఉంటుంది` అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్‌లో
చూపించిన భారీ సెట్టింగులు, యుద్ధ సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.
సాప్ట్ రోల్ లో షాహిద్ కపూర్, అతన్ని వీరుడిగా సాగనంపే భార్య పద్మావతిగా దీపికా పదుకునే.. ఎలాగైనా రాజ్యాన్ని.. పద్మావతిని సొంతం చేసుకోవాలని చూసే రాజుగా అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్ లో రణ్ వీర్ సింగ్ లు ఆకట్టుకున్నారు. అయితే చరిత్రలో అల్లావుద్దీన్-పద్మావతి ఒకరినొకరు చూసుకోలేదన్న వాదన ఉంది. ఖిల్జీ చేతికి చిక్కక ముందే ఆమె తన వంద మంది పరివారంతో మంటలో దూకి ఆత్మహత్య చేసుకుందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రాజ్ పుత్ ల నుంచి విమర్శలు ఎదురుకాకుండా బన్సాలీ సినిమాను ఎలా తెరకెక్కించాడన్నదే ప్రధానాంశంగా మారబోతుంది. డిసెంబర్ 1న పద్మావతి చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more