మహేష్ స్పెషల్ సర్ ప్రైజ్ ఇక లేదా? | Super Star surprise with Boom Boom Teaser

Spyder song teaser boom boom

Spyder Movie, Spyder Movie Boom Boom, Mahesh Babu Boom Boom, Boom Boom Song Teaser, Mahesh Babu Boom Boom Song, Boom Boom Song SPYder, SPYder Audio Songs, SPYder Surprise Teaser

Spyder Movie Boom Boom Boom song teaser Out. Mahesh Babu looks stunningly stylish in the sneak peek.

స్పైడర్ బూమ్ బూమ్ సాంగ్ టీజర్ రిలీజ్

Posted: 07/31/2017 08:24 AM IST
Spyder song teaser boom boom

మహేష్ బాబుకు కోలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకపోయినా మురగదాస్ పై నమ్మకంతో భారీ బిజినెస్సే చేసింది స్పైడర్. కానీ, స్టైలిష్ టీజర్ గ్లింప్స్ తర్వాత ప్రిన్స్ కూడా అక్కడి జనాలకు ఎక్కేయటం ప్రారంభించాడు. ఫుల్లీ యాక్షన్ లోడెడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరో తుపాకీ అవుతుందని మేకర్లు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఊహించని సర్ప్రైజ్ ఇచ్ఛి అభిమానులను షాక్ కి గురిచేశారు.

చిత్రంలోని 'బూమ్ బూమ్' అంటూ సాగే పాటకు సంబంధించిన టీజర్ ను ఈ సాయంకాలం విడుదల చేశారు. మహేశ్ అభిమానులకు ఇదొక ఊహించని గిఫ్ట్ అని చెప్పచ్చు. ఇక పూర్తి పాటను ఆగస్టు రెండు సాయంకాలం ఆరు గంటలకు రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. అలాగే, అదే రోజు పాటతో పాటు సినిమా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు. రొమానియాలో ప్రస్తుతం ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా, తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య నెగటివ్ రోల్ లో, భరత్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రావొచ్చేమో అనుకుంటున్న తరుణంలో ఈ ఊహించని ట్విస్ట్ తో ఆ రోజు సెకండ్ టీజర్ ఉండే ఛాన్స్ తక్కువేనని చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder  Boom Boom Teaser  

Other Articles