Kona Quick Reply from KTR on GST Bill

Ktr reaction on kona s tweet

Kona Quick Reply from KTR, Kona KTR, Writer Kona Twitter, Kona GST Tweet, KTR on GST, KTR Film Industry GST, Kona KTR, KTR Tollywood Relations

Tollywood Writer KTR Tweet to KTR on GST. T Minister quick reply to that one.

జీఎస్టీపై కోన ట్వీట్.. కేటీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడంటే...

Posted: 06/28/2017 06:46 PM IST
Ktr reaction on kona s tweet

సినీ ఇండస్ట్రీలో జీఎస్టీ పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. తమకు మరెయితర టాక్స్ లు విధించే అవకాశాలు లేకపోవటంతో వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ఆయా ఇండస్ట్రీలపై బాదుడు షురూ చేసేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ల రేటు పెంచేసిన విషయం తెలిసిందే. మరోపక్క ఇతర రకాల పన్నులు మోపి తమపై భారం పెంచుతుందేమోనన్న ఆందోళన సినీ పెద్దల్లో పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో సినీ ర‌చ‌యిత కోన వెంక‌ట్ తెలంగాణ‌ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశాడు. జూలై 1 నుంచి అమ‌లులోకి వ‌స్తోన్న జీఎస్టీ నేప‌థ్యంలో సినిమాకు విధించే ప‌న్ను విష‌యంలో కేర‌ళ ప్రభుత్వం ఇటీవ‌లే కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని, జీఎస్టీలో భాగంగానే సినిమాకు ప‌న్ను వ‌సూలు చేస్తామ‌ని, ఇత‌ర ఎటువంటి ర‌కాల ప‌న్నులు విధించ‌బోమ‌ని తెలిపింద‌న్న విషయాన్ని ప్రస్తావించాడు. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

దీనికి కేటీఆర్ వెంటనే స్పందించాడు. ఆర్ధిక మంత్రి ఈటల రాజేంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో భేటీ అవుతున్నార‌ని తెలిపాడు. దీంతో ఈరోజు జరిగే చర్చల్లో ఫలితం ఎలా ఉండబోతుందా? అని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kona Venkat  Minister KTR  TollYwood News  

Other Articles