మెగాహీరోకి ఎన్టీఆరే ఎందుకంత స్పెషల్ అంటే.. | NTR special friend to this Mega Hero.

Sai dharam tej about his closeness to nandamuri hero

Sai Dharam Tej, Mega Hero Nandamuri Family, Sai Dharam Tej Balakrsihna, Sai Dharam Tej NTR, NTR Sai Dharam Tej Friendship, Sai Dharam Tej Nandamuri Heroes, NTR Mega Hero, Jr NTR Sai Dharam Tej, Mega Hero Praised Balayya

Supreme Hero Sai Dharam Tej reveal his friendship with Junior NTR, and praised Nandamuri Balakrishna.

ఎన్టీఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి ధరమ్ తేజ్

Posted: 02/23/2017 10:21 AM IST
Sai dharam tej about his closeness to nandamuri hero

టాలీవుడ్ అందరివాడిగా మారిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వ్యవహారం గురించి ఆ మధ్య స్పెషల్ చర్చ జరిగింది. చిన్న చితకా పంక్షన్ల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరి ఈవెంట్లలో ఈ సుప్రీం హీరో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే మిగతావాళ్ల సంగతి పక్కనబెడితే ముఖ్యంగా నందమూరి కాంపౌండ్ తో ఈ హీరో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నాడన్నది మాత్రం చెప్పుకోదగింది. ఆ మధ్య జవాన్ చిత్ర ఓపెనింగ్ సందర్భంగా తన ఫ్యామిలీ హీరోలెవరూ లేకుండానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమాను లాంఛ్ చేయించటంతో కొత్త పుకార్లు రేగాయి. అయితే దీనిపై విన్నర్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు సాయి.

నందమూరి హీరోలంటే తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పిన ఈ మెగా హీరో ముఖ్యంగా ఎన్టీఆర్ తో తనకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉందని తెలిపాడు. ‘‘తారక్ నా పాత స్నేహితుడు. ఎన్నో ఏళ్లుగా మేం మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తున్నాం. అతన్ని నేను ఎంతో గౌరవిస్తాను కూడా. ఆ చొరవతోనే జవాన్ లాంఛ్ కి పిలవగా, అభ్యంతరం చెప్పుకుండా వచ్చాడ’’ని వివరించాడు. ఇక మరో హీరో కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టారర్ డిస్కషన్ దశలో ఉందని చెప్పి, ఆ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

ఇక చివర్లో బాలయ్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలో నాలాంటి యువహీరోలకు ఆయన ఎంతో ఆదర్శం. ఆయన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఈ వయసులో కూడా బాలయ్య కఠోర దీక్ష తో పని చేయటం గ్రేట్. అదే ఆయన్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని చెప్పుకొచ్చాడు. అన్నట్లు శాతకర్ణి రిలీజ్ సమయంలో కూడా తేజూ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది కూడా.  మొత్తానికి ఓ మెగా హీరో ఇలా నందమూరి ఫ్యామిలీ గురించి స్పెషల్ గా ప్రశంసలు కురిపించటం సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Jr NTR  Friendship  

Other Articles

Today on Telugu Wishesh