ఖైదీ-శాతకర్ణి లాంటి సినిమాలు ఉండగా అది రావటం తప్పేమో! | Tammareddy About Head Constable Venkatramaiah Movie

Tammareddy bharadwaj view on constable venkatramaiah release

Tammareddy Bharadwaj, Constable Venkatramaiah, R Narayana Murthy, Tammareddy About Narayanamurthy movie, Constable Venkatramaiah Tammareddy, Constable Venkatramaiah controversy

Tammareddy Comments On Head Constable Venkatramaiah release and Sankranti Movies.

నారాయణమూర్తి చేసిన తప్పు అదే!

Posted: 01/19/2017 09:44 AM IST
Tammareddy bharadwaj view on constable venkatramaiah release

ఏడాది ఆరంభం, పైగా సంక్రాంతి సీజన్ టాలీవుడ్ లో సందడి నెలకొంది. ఇద్దరు అగ్రహీరోలు, మరో కుర్రహీరో సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. కలెక్షన్ల పరంగా పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ సినిమా ఫర్ ఫెక్ట్ హిట్టో తెల్చే క్రమంలో సందట్లో సడేమియాగా వచ్చిన మరో సినిమా గురించి కామెంట్లు చేశాడు.

అదే ఆర్ నారాయణమూర్తి కానిస్టేబుల్ వెంకట్రామయ్య గురించి. నిజానికి ఈ సినిమాకు థియేటర్లు దొరక్కపోవటంపై నిర్మాత కమ్ దర్శకుడు చదలవాడ, హీరో నారాయణమూర్తి పెద్ద రాద్ధాంతమే చేశారు. చివరకు ఎలాగోలా అడ్జస్ట్ కావటంతో పెద్ద సినిమాల సందట్లో ఉండగానే వచ్చింది. చూసిన వాళ్లు కూడా బాగానే ఉందని చెబుతున్నారు. కాకుంటే ఆయన సినిమాలకు థియేటర్లు దొరకలేదు. జరగాల్సింది.. జరిగి పోయింది. ఎగ్జిబిటర్లు జనాల్లో క్రేజ్ ఏ సినిమాకు ఉంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలకు.. జనాలేమో టాక్ వచ్చిన సినిమాలకు వెళుతుంటారు. నిర్మాతలేమో మన సినిమా పండగక్కి వస్తే బాగుంటుందని అనుకుంటారు. అయితే నారాయణమూర్తిగారి నిర్మాత స్ట్రాంగ్ అయినప్పటికీ థియేటర్లు చేతిలో లేవు కాబట్టి హాల్స్ దొరకలేదు.

సినిమాలు తీయటం నిర్మాతకు ఎంత ముఖ్యమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లటం కూడా అంత ముఖ్యం. సినిమా తీసి.. జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో కాస్త వెనక్కి తగ్గటం తప్పేం కాదు. అదేం పరువు పోవటం కాదు.. ఒక అడుగు వెనుక వేసి.. తర్వాత రెండు అడుగులు ముందుకు వేయటం. అది చేసి ఉంటే నారాయణమూర్తి సినిమాకు న్యాయం జరిగి ఉండేది. ఎగ్జిబ్యూటర్స్ థియేటర్లు ఇవ్వలేదని అనేయటం సరికాదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈవారమైనా థియేటర్లు దొరికి సినిమాను నిలబెడతాయని ఆశిస్తున్నా అంటూ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constable Venkatramaiah  Tammareddy Bharadwaj  Sankranti release  

Other Articles