వెంకీ యూత్ కి ఇచ్చే సందేశం ఇదే... | Venky message to teenagers.. Say no to peer pressure

Venkatesh s message to teenagers

Tollywood top actor Venkatesh, actor Venkatesh Say no to peer pressure, Teenage Foundation, Say no to peer pressure video, Say no to peer pressure Venkatesh, Say no to peer pressure, Venkatesh Message to Youth, Teenage Foundation videos

Tollywood top actor Venkatesh Say no to peer pressure video.

నో చెప్పటం నేర్చుకోమంటున్న వెంకీ!

Posted: 11/15/2016 04:35 PM IST
Venkatesh s message to teenagers

మంచి చెప్పడానికి బాగుంటుది కానీ, వినడానికి చాలా చేదుగా ఉంటుందన్నది ఇప్పుడున్న జనరేషన్ అభిప్రాయం. పెద్దలు చెప్పే నీతి వాక్యాలను వినే తీరిక, ఒపిక అస్సలు లేదు. డ్రగ్స్, మందు, సిగరెట్లు ఇలా చెడువ్యసనాలకు ఈజీగా బానిసలైపోతున్నారు. అందుకే కొన్ని ఫౌండేషన్లు స్టార్ల సహకారంతో అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వారితో షార్ట్ ఫిల్మ్ లు, యాడ్స్ చేయించి ఆ సందేశాత్మక చిత్రాలను ప్రదర్శిస్తూ యూత్ లోకి ఈజీగా చేరవేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ నటించిన ఓ షార్ట్ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. డాక్టర్ లలితా ఆనంద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టీనేజ్ ఫౌండేషన్ అనే సంస్థ రూపొందించింది.  రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో యూత్ చెడుబాట పట్టొదంటూ చిల్ట్రన్ డే సందర్భంగా వెంకీ మంచి సందేశాన్నే ఇచ్చాడు.

‘‘దురలవాట్లు ఎప్పూడూ సరదాగానే ఉంటాయి. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది అనిపించచ్చు. మీ ఫ్రెండ్స్ ఫీలవుతున్నారనో,  అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటన్న భావనతోనో మీరూ వాటికి బానిసలవుతారు. ఫలితం మీ జీవితాన్ని కోల్పోవటం. అందుకే ఎదుటివాళ్లు చెప్పినట్లు చేయకపోతే వాళ్లు నాకు దూరమవుతారు అనే ఒత్తిడి జయించాలి. ఇలా ఆలోచించి మొదలుపెడితే.. ఆ కారణంగా రాబోయే ఫలితాలను ఆలోచించలేరు. ఫ్రెండ్స్ ని నిరాశపరచడం ఇష్టం లేక మీ జీవితాలను ప్రమాదంలో పడేసుకోవడం కరెక్ట్ కాదు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఒకసారి నో చెప్పండి.. అప్పుడు ఎదుటివారు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన పని లేదు.  వాళ్లు మిమ్మల్ని వదిలేసినా ఏం పర్లేదు. మీకు మీ జీవితం ముఖ్యమని తెలుసుకోండి. నో చెప్పడం నేర్చుకోండి' అంటూ అందులో వెంకీ పెద్ద మెసేజే ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Say no to peer pressure  Victory Venkatesh  Teenage Foundation  

Other Articles

Today on Telugu Wishesh