హృతిక్ గుడ్డిగా ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు | Kaabil Official Trailer released

Kaabil official trailer released

Hritik Roshan's Kaabil Official Trailer released, Kaabil Blind Revenge Drama, Kaabil Official Trailer, Hritik Blind revenge Drama, Hritik and Yami Blind romantic drama, Kaabil Official Trailer, Hritik Balam Official Trailer

Hritik Roshan's Kaabil Official Trailer released. Blind Revenge Drama with low budget.

కాబిల్ ట్రైలర్ : మైండ్ తో చూడమంటున్న హృతిక్

Posted: 10/26/2016 10:12 AM IST
Kaabil official trailer released

మొహంజోదారో లాంటి భారీ డిస్సాప్పాయింట్ మెంట్ తర్వాత సేఫ్ సైడ్ గా ఒక లో-బడ్జెట్ మూవీతో రాబోతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. సంజయ్ గుప్తా దర్శకత్వంలో తండ్రి రాకేష్ రోషన్ నిర్మాతగా కాబిల్ అంటూ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే వాయిస్ ఓవర్ తో ఓ టీజర్ ను వదలగా, ఇప్పుడు ట్రయిలర్ ను విడుదల చేసేశాడు. పెయిర్ అండ్ లవ్లీ మోడల్, నటి యామీ గౌతమ్ హృతిక్ సరసన ఇందులో నటిస్తోంది.

ఇక కాబిల్ ట్రయిలర్ విషయానికొస్తే... అంధుడైన ఇద్దరు ప్రేమించుకుని, పెళ్లి కూడా చేసుకుంటారు. అంతా కలర్ ఫుల్ గా,  సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ఊడిపడిన ఓ గ్యాంగ్ వీరి జీవితంలో అల్లకల్లోలం రేపుతుంది. మరి వారిపై ఆ అంధుడైన వ్యక్తి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అన్నదే కథ ఇందులో చూపించారు. ఇక పెద్ద హీరో సరసన ఫస్ట్ టైం నటిస్తున్నాని ఏమో రొమాన్స్ లో యామీ బాగానే రెచ్చిపోయింది. అలాగే అంధుడైనప్పటికీ తన భార్యకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే వ్యక్తిగా ఫైర్ తో హృతిక్ నటించాడు.

కళ్లు లేని ఓ వ్యక్తి కేవలం మైండ్ తో చూస్తూ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకునే లాంటి అంశం చాలా రిస్క్ అయినప్పటికీ, హృతిక్ లాంటి హీరోతో చేయించటం ఖచ్ఛితంగా ప్రయత్నమే అవుతుందని అనుకోవాలి. రిపబ్లిక్ డే సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది.      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hritik Roshan  Kaabil Official Trailer  Blind Revenge Drama  

Other Articles

Today on Telugu Wishesh