డియర్ జిందగీ టీజర్ లో కెమిస్ట్రీ అదిరింది మరి... | SRK dear zindagi teaser out

Srk dear zindagi teaser out

SRK dear Zindagi first look, Dear Zindagi First Look, Dear Zindagi teaser,Alia and SRK Dear Zindagi

Sharukh khan starrer dear zindagi teaser out. Alia Bhatt chemistry pleasant.

డియర్ జిందగీ కెమిస్ట్రీ బాగా కుదరిందే

Posted: 10/19/2016 03:31 PM IST
Srk dear zindagi teaser out

ఏ చిత్రం అయినా సరే క్రేజీ కాంబినేషన్ లో అనౌన్స్ చేసినప్పుడు దానిపై అంచనాలు పెరిగిపోవటం సహజం. కానీ, ఏజ్ గ్యాప్ లో సగానికి సగం ఉన్న బాద్ షా షారూఖ్ ఖాన్, అలియా భట్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే అంతా నోళ్లు వెళ్లబెట్టారు. సినిమాలో అసలు కంటెంట్ ఏమై ఉంటుందా అన్న సస్పెన్స్ మెయింటెన్ చేస్తూనే నిన్న ఫస్ట్ లుక్ ను వదిలారు. అందులో ఇద్దరు చాలా కూల్ లుక్ లో కనిపించారు.

Dear Zindagi First look

ఇక ఈరోజు ఏకంగా టీజర్ ను వదిలింది చిత్ర యూనిట్. నిమిషంన్నర ఉన్న ఈ టీజర్ లో షారూఖ్, అలియాలు చాలా ఈజ్ తో కెమిస్ట్రీ పండించారు. చిన్నప్పుడు తన తండ్రి సముద్రంతో కబడ్డీ ఆడేందుకు తీరానికి తెచ్చేవాడని షారూఖ్ అలియాతో చెప్పటం, ఆపై పరిగెడుతూ కబడ్డీ ఆడటంతో టీజర్ ప్రారంభమౌతుంది. ఆపై ఇద్దరు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటారు. తనకు స్వేచ్ఛ కావాలంటూ అలియా అరుస్తూ ముందుకు వెళ్తుంటుంది. కాస్త దూరం వెళ్లాక కింద పడిపోవటంతో చేయి అందించినట్లే అందించి, షారూఖ్ తాపీ గా వెళ్లిపోతుంటాడు. అమిత్ త్రివేది అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ప్లజెంట్ గా ఉంది. కాన్సెప్ట్ ఏంటో అర్థం కాకపోయినప్పటికీ, ప్రజంటేషన్ మాత్రం చాలా ఆకట్టుకుంది.

లైఫ్ ఈజ్ ఏ గేమ్ అనే కాన్సెప్ట్ తో తెరకెకుతున్న ఈ చిత్రానికి నిర్మాతలుగా షారూఖ్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్, కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్ వ్యవహరిస్తున్నాయి. గౌరీ షిండే డైరక్షన్. నవంబర్ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పాక్ నటుడు ఫవాద్ ఉండటంతో సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని ఇప్పటికే రాజకీయ సంఘాలు హెచ్చరించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dear Zindagi  SRK  Alia Bhatt  teaser  

Other Articles