టాప్ హీరోయిన్లందరికీ దాసరి డెడ్లీ వార్నింగ్ | Dasari warns heroines about telugu language

D asari warns heroines about telugu language

Dasari warns heroines, Dasarai heroine languages, dasari walkout from function, dasari about telugu heroines, Darsakaratna warns heroines

Dasari Narayanarao warns heroines about telugu language.

ఇకపై పంక్షన్లకు దాసరి టఫ్ కండిషన్స్ అప్లై

Posted: 10/13/2016 10:28 AM IST
D asari warns heroines about telugu language

తెలుగులో చిన్న పెద్ద చిత్రాలకు తేడా లేకుండా అన్నింటి పంక్షన్లకు హాజరై ఆశ్వీరదించడం దర్శకరత్న దాసరి  నారాయణరావుకు ముందు నుంచి అలవాటు అయిన పనే. పనిలో పనిగా ఆ పంక్షన్లలో కొన్ని సినీ కుటుంబాల హీరోలను ఉద్దేశించి పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. ఇక ఇప్పుడు ఆ దృష్టి హీరోయిన్లవైపు మళ్లీనట్లు ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమ ఆంగ్ల చిత్ర పరిశ్రమగా మారిపోతోందని, ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్లు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని ఆరోపించిన దర్శకరత్న దాసరి, హీరోయిన్లు తెలుగులో మాట్లాడకపోతే, తాను ఫంక్షన్స్ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలుపుతానని హెచ్చరించారు.

ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, ఏ భాష నుంచి వచ్చిన హీరోయిన్లయినా, తెలుగు పరిశ్రమ గౌరవిస్తుందని, ను కాబట్టి వారంతా తెలుగు నేర్చుకుని రావాలని తాను సిన్సియర్ సలహా ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు వేదికపై ఉన్న హీరోయిన్లు రాయ్ లక్ష్మి, నికిషా పటేల్, అరుంధతీ నాయర్ లు తదుపరి స్టేజ్ ఎక్కేలోగా తెలుగులో మాట్లాడాలని, లేకుంటే ఆ సభ నుంచి తాను వెళ్లిపోతానని అన్నారు. ఇప్పుడున్న అగ్రహీరోయిన్లలో ఒకరిద్దరికి తప్ప అందరూ తెలుగు మాట్లాడేవారే. సో... కుర్రహీరోయిన్లు స్టేజీ మీద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిందన్న మాట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayanarao  telugu heroines  languages  warning  

Other Articles

Today on Telugu Wishesh