నాని మజ్ను ఫస్ట్ లుక్ | nani majnu firstlook released

Nani majnu firstlook released

Nani majnu firstlook, Nani funny majnu firstlook, majnu movie firstlook

Nani majnu firstlook released.

నాని మజ్ను ఫస్ట్ లుక్ : ఓరి దీని వేషాలూ...

Posted: 07/30/2016 06:01 PM IST
Nani majnu firstlook released

నాగార్జున ఆల్ టైం హిట్ మూవీ మజ్ను పేరుతో నేచురల్ స్టార్ నాని ఓ చిత్రం తీయబోతున్న సంగతి తెలిసిందే. జెంటిల్మెన్ హిట్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే ఆ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసేశాడు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకుడు. వెరైటీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి తన చిత్రాలకు మంచి ప్రమోషన్ చేసే నాని దీనికి అదే పని చేశాడు.

'స్టాప్‌ డ్రింకింగ్‌ స్టార్ట్‌ లవింగ్‌' అనే ట్యాగ్‌ లైన్‌తో నాని చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని గ్రామ్‌ఫోన్‌ వద్ద టెడ్డీబేర్‌తో కబుర్లు చెబుతూ ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. నాని షర్ట్ లోపల టీషర్టులో ఇద్దరు చిన్నపిల్లలు ఉండి.. ఓరి దీని వేషాలూ అన్న అక్షరాలు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఇదో టిపికల్ లవ్ స్టోరీ అనిపిస్తోంది.

అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.కిరణ్‌ నిర్మాత. తుదిదశ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న గానీ, లేకపోతే దసరాకు గానీ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  majnu  firstlook  

Other Articles