తమన్నా హాట్ షో కోసం ఎంత తగ్గిందంటే... | tamanna reduce her remuneration for sampath nandi

Tamanna reduce her remuneration for sampath nandi

tamanna gopichand movie, tamanna special song remuneration, tamanna hot, tamanna item song, sampath nandi tamanna

tamanna reduce her remuneration for gopichand movie item song

తమన్నా హాట్ షో కోసం ఎంత తగ్గిందంటే...

Posted: 07/25/2016 04:01 PM IST
Tamanna reduce her remuneration for sampath nandi

మిల్కీ బ్యూటీ తమన్నా సోగసుల కోసమే థియేటర్లకు వచ్చే జనాలు ఉండటంతో పాపం ఆమెను ఐటెం గర్ల్ గా మార్చేశారు కొందరు దర్శకులు. సందులో సడేమియాగా ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇవ్వటంతోపాటు స్పెషల్ సాంగ్ పేరిట బాగానే వెనకేసుకుంటుంది తమ్మూ.  బెల్లంకొండ శీను రెండు చిత్రాల్లో భారీ రెమ్యునరేషన్ తో  ప్రత్యేక గీతాల్లో అలరించిన తమన్నా ఇప్పుడు మరో హీరో కోసం రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.

రచ్చ ఫేం సంపత్ నందీ గోపీచంద్ కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా హన్సిక, కేథరిన్ లను ఎంపిక చేశారు. ఇందులో తమన్నా ఐటెం సాంగ్ చేయబోతుందన్న సంగతి తెలిసిందే. రచ్చ, బెంగాల్ టైగర్ సెంటిమెంట్ తో తమన్నాను చూపించాలన, పైగా ఆ రెండు చిత్రాల్లో తమన్నా హాట్ పాటలు బాగా హిట్ కావటమే ఇందుకు కారణం.

అయితే ఆమె రెమ్యునరేష్ ఎక్కువగా ఉండటంతోపాటు, పాట చిత్రీకరణకు బడ్జెట్ తడిసి మోపెడు అవుతుందన్న భయంతో నిర్మాతలు అందుకు నో చెబుతున్నారంట. అయినా పట్టువిడవని సంపత్ నంది ఆమె కోసం తన రెమ్యునరేషన్ లో కోతకి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. చివరికి సంపత్ త్యాగం గురించి తెలుసుకున్న తమన్నా తక్కువ రెమ్యునరేషన్ కే ఐటెం గర్ల్ గా మారిపోయిందని తెలుస్తోంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampath nandi  tamanna  gopichand  item song  remuneration  

Other Articles