Nargis Fakhri: Wouldn't do a sex comedy in India

Nargis fakhri not comfortable doing adult comedies

nargis fakhri, azhar, azhar cast, nargis fakhri film, nargis fakhri upcoming film, nargis fakhri news, nargis fakhri adult comedy,entertainment news

Nargis Fakhri said: “I wouldn't do it (adult or sex comedy films). Also the sense of humour is very different in India.

బాలీవుడ్ లో మాత్రం అడల్ట్ చిత్రాలలో నటించనని తెగేసి చెప్పిన నటి

Posted: 04/24/2016 07:20 PM IST
Nargis fakhri not comfortable doing adult comedies

ప్రపంచంలోనే భిన్నమైన సంస్కృతి సంప్రదాయం కలిగిన భారతదేశ చలనచిత్ర రంగం బాలీవుడ్ లో తాను ఎలాంటి అడల్ట్‌ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించబోనని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ చెప్పారు, అయితే ఇతర దేశాల్లో తాను అడల్ట్ చిత్రంలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది ఈ బామ. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్‌-3' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండియాలో అలాంటి సినిమాలు చేయలేనని, అమెరికా లేదా ఇతర విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరముండదని చెప్పుకొచ్చింది.

అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్ కు ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. 'నేను ఇక్కడ అలాంటి (అడల్ట్‌, సెక్స్ కామెడీ) సినిమాలు చేయబోను. ఆ విషయంలో సెన్స్‌ హ్యూమర్‌ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యుమర్‌ వేరే రకంగా ఉంటుంది. అమెరికాలో అయితే నేను తప్పకుండా ఆ సినిమాల్లో నటిస్తా. ఇక్కడ మాత్రం చేయను' అని నర్గీస్‌ తాజాగా సెలవిచ్చింది.

బాలీవుడ్‌లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు బాగానే కాసులు కురిపించాయి. అయితే, ఇప్పటివరకు బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. అక్షయ్‌ కుమార్, అభిషేక్ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్‌ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతోపాటు అజారుద్దీన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న 'అజార్‌' సినిమాలోనూ నర్గీస్ నటిస్తోంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nargis Fakhri  Housefull 3  Azhar  Grand Masti  

Other Articles