Vijay | Polisodu | Theri | Audio songs | Trailer

Vijay polisodu first look

Vijay Polisodu first look poster, Vijay Theri as Polisodu, Theri Official Trailer, Theri Songs, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Vijay Polisodu first look: Vijay's latest film Theri. director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

విడుదలైన విజయ్ ‘పోలీసోడు’ ఫస్ట్ లుక్

Posted: 04/02/2016 06:15 PM IST
Vijay polisodu first look

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగులో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు టైటిల్ ను అధికారికం గా ప్రకటించటం జరిగింది. ‘రాజా రాణి’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వంలో ముస్తాబవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

"తుపాకి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్ హీరోగా, ‘రాజారాణి’తో మంచి పేరు తెచ్చుకున్న అట్లి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ఈ చిత్రానికి తెలుగులో ‘పోలీసోడు’ అనే మాస్ టైటిల్ ను ఖరారు చేసాం. ఏప్రిల్ లో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అని దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

విజయ్, సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకత్వం - స్క్రీన్ ప్లే - అట్లి; ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్; ఎడిటర్ - అన్తోనీ రుబెన్; సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్; సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్; నిర్మాతలు - రాజు, కలైపులి ఎస్ థాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Polisodu  Trailer  audio jukebox  stills  

Other Articles