Nara Rohit | Balakrishna | Savitri Collections | Stills

Nara rohit wants to act with balakrishna

Nara Rohit comments on balakrishna, Nara Rohit talks about balakrishna, Nara Rohit savitri success, Nara Rohit movie collections, Nara Rohit Savitri Collections, Nara Rohit movies list, Nara Rohit latest stills

Nara Rohit wants to act with Balakrishna: Nara Rohit latest film Savitri released 1 April. Nara Rohit wants to do a film with nandamuri balakrishna.

బాలయ్యతో సై అంటున్న నారా హీరో

Posted: 04/02/2016 01:08 PM IST
Nara rohit wants to act with balakrishna

ఒకప్పడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి నటులు ఏడాదికి ఐదారు చిత్రాలను వరుసగా చేస్తూ బిజీగా వుండేవారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి తారలు వరుసగా ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేయడం కూడా కరువయ్యారు. కానీ ప్రస్తుతం వున్న నటులలో నారా రోహిత్ దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో ఏడెనిమిది ప్రాజెక్టులు వున్నాయి. ఇందులో ‘తుంటరి’, ‘సావిత్రి’ చిత్రాలు తాజాగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకోగా... మరో ఏడు చిత్రాలతో నారా రోహిత్ బిజీగా వున్నాడు.

నారా రోహిత్ ‘రాజా చెయ్యి వేస్తే’, ‘పండగలా వచ్చాడు’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘కథలో రాజకుమారి’, ‘జ్యో అచ్యుతానంద’తో పాటు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. అయితే తాజాగా నారా రోహిత్ నటించిన ‘సావిత్రి’ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంధర్భంగా నారా రోహిత్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

సినిమాకు మంచి టాక్ రావడం సంతోషంగా వుందని, అయితే సినిమా పైరసీని ప్రోత్సహించవద్దని ప్రేక్షకులను కోరారు. ఇక మంచి కథ లభిస్తే నందమూరి బాలకృష్ణతో చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని నారా రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి బాలయ్య-నారా రోహిత్ ల కాంబినేషన్లో రాబోయే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాల్చనుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Savitri  Balakrishna  Collections  Stills  

Other Articles