Eedo Rakam Aado Rakam | Manchu Vishnu | Raj Tarun | Sonarika | Hebah patel

Eedo rakam aado rakam first look poster

Manchu Vishnu Raj Tarun Eedo Rakam Aado Rakam, Eedo Rakam Aado Rakam posters, Manchu Vishnu Raj Tarun Movie stills, Manchu Vishnu Movie Posters, Vishnu Raj Tarun Movie details, Vishnu Raj Tarun Movie started, Vishnu Raj Tarun Movie updates, Vishnu, Raj Tarun

Eedo Rakam Aado Rakam First Look Poster: Tollywood actors Manchu Vishnu and Raj Tarun acts in lead roles. G. Nageshwara reddy direction. Sonarika, Hebah patel heroines.

టైటిల్ ఖరారు: ‘ఈడోరకం.. ఆడోరకం’

Posted: 03/18/2016 12:33 PM IST
Eedo rakam aado rakam first look poster

మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రానికి తాజాగా టైటిల్ ను ఖరారు చేసారు. ముందుగా ఈ చిత్రానికి ‘వీడు అదో టైపు .. వాడు మరో టైపు’ అనే టైటిల్ ను పరిశీలించారు. కానీ తాజాగా ‘ఈడోరకం.. ఆడోరకం’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇప్పటికే విడుదలైన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ చూస్తుంటే.. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎకె. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

విష్ణు సరసన ‘జాదుగాడు’ ఫేం సోనారిక, రాజ్ తరుణ్ సరసన ‘కుమారి 21 ఎఫ్’ ఫేం హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Raj Tarun  Eedo Rakam Aado Rakam  Sonarika  Hebah Patel  stills  

Other Articles