Shriya Saran | Clarifies | Baahubali2 | Rana | Prabhas

Shriya clarifies on baahubali2 rumors

Shriya Saran Clarifies on Baahubali2 rumors, Shriya Saran talks about Baahubali2, Shriya comments on baahubali2, Shriya latest stills, Shriya hot stills, Shriya movies, Shriya movie news, Shriya

Shriya Clarifies on Baahubali2 rumors: South indian actress Shriya Saran Clarifies on Baahubali2 film offer rumors.

బాహుబలి పుకార్లను కొట్టిపారేసిన శ్రియ

Posted: 03/17/2016 05:56 PM IST
Shriya clarifies on baahubali2 rumors

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘బాహుబలి2’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో రానా నటించిన భల్లలాదేవ పాత్రకు భార్యగా హీరోయిన్ శ్రీయను ఎంపిక చేసినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ వార్తలు నిజమేనని భావించారు.

అయితే ‘బాహబలి2’లో తాను నటించడంలేదని శ్రీయ క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయంపై శ్రీయ స్పందిస్తూ... ‘బాహుబలి2’లో నటించమని తనను ఎవరూ సంప్రదించలేరని, ఈ సినిమాలో నటించాలని తనకు కూడా వున్నప్పటికీ.. కానీ నటించే అవకాశం ఇంకా రాలేదని శ్రీయ చెప్పుకొచ్చింది. దీంతో ఈ రుమార్లకు ఓ స్వస్తి పలికినట్లుగా అయ్యింది.

అయితే ‘బాహుబలి2’లో భల్లలాదేవుడి భార్య పాత్ర వుంటుందో లేదో అనేది సినిమా విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికొస్తే... ‘బాహుబలి2’లో ప్రభాస్, రానాలతో పాటుగా అనుష్క సందడి చేయనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2017లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriya Saran  Clarifies  Baahubali2  Prabhas  Rana  Anushka  

Other Articles