Sanjay Dutt | released | Free Dish | fans | Mumbai Hotel

Actor sanjay dutt released

Sanjay Dutt release, Sanjay Dutt release dish, Sanjay Dutt release food, Sanjay Dutt fan celebrating, Sanjay Dutt release date, Sanjay Dutt fans

Actor Sanjay Dutt released: Bollywood actor Sanjay Dutt's released today morning. Sanjay Dutt latest news, stills, details, updates.

ఆనందంతో తిండి, నిద్ర లేదంటున్న సంజయ్ దత్

Posted: 02/25/2016 05:29 PM IST
Actor sanjay dutt released

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఆయన శిక్ష అనుభవించాల్సి ఉన్నా....8 నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు. జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బావుందని, సత్ర్పవర్తన కారణంగా అతన్ని ముందుగా విడుదల చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ ప్రకటించింది.

హోంశాఖ ప్రకటించినట్లుగానే సంజయ్ దత్ ను జైలు నుంచి విడుదల చేసారు. జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ దత్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. జైలు నుంచి బయటకు వస్తున్నానన్న ఆనందం.. ఇక మళ్లీ లోపలకు రావల్సిన అవసరం లేదన్న భావనతో చాలా ఉద్వేగంగా అనిపించిందని, అందుకే బుధవారం రాత్రి అంతా తాను తిండి సరిగా తినలేదు.. నిద్ర కూడా పోలేదని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తెలిపారు.

సంజయ్ దత్ మాట్లాడుతూ.... ఇన్నాళ్లకు తనకు స్వాతంత్ర్యం లభించిందని, కానీ ఇప్పుడు కూడా ఆ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఈ సమయంలో తనకు తన తండ్రి బాగా గుర్తుకొస్తున్నారని, ఆయన ఉంటే చాలా సంతోషించేవాళ్లని తెలిపారు. తాను ఈ దేశ పౌరుడినని, భారతీయుడైనందుకు గర్వపడుతున్నానని సంజయ్ దత్ చెప్పారు. అలాగే శిక్ష విధించే సమయంలో కూడా.. తాను టెర్రరిస్టును కానని కోర్టు చెప్పిందని, ఆ విషయం తన తండ్రి సునీల్‌దత్‌కు తెలిస్తే ఇంకా బాగుండేదని అన్నారు. అనంతరం తన భార్య, కొడుకు, కూతుళ్లతో కలిసి మీడియాకు ఫొటో పోజులు ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Released  Free Dish  Mumbai Hotel  Celebrations  

Other Articles