trivikram srinivas working for megastar 150th movie

Trivikram srinivas in race for chiru s 150th movie

trivikram srinivas, megastar Chiranjeevi, 150th movie, trivikram srinivas, chiranjeevi, kaththi, nithiin, puri jagannadh, Bruce Lee Role, Ram charan, Surekha, Pawan Kalyan

latest buzz in the cine circles is that none other than the “Wizard of Words” Trivikram Srinivas will be directing the Megastar's 150th. movie

చిరు సినిమాను డైరెక్ట్ చేయనున్న మాటల మాంత్రికుడు

Posted: 11/22/2015 09:13 PM IST
Trivikram srinivas in race for chiru s 150th movie

మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీగా చెబుతున్న 150వ సినిమాపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారంటూ చాలా మంది దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ కోట్టేశాడని ఫిల్మనగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ చిరుకు కథ కూడా వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని భావించారు.

 రామ్ చరణ్ నిర్మాణంలో ఆటోజాని పేరుతో ఆ సినిమా ఉంటుందని చరణ్ స్వయంగా ప్రకటించాడు. కానీ సెకండాఫ్ కథ కుదరకపోవటంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. తరువాత వినాయక్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా కత్తిని రీమేక్ చేస్తారన్న టాక్ వినిపించినా అఫీషియల్గా మాత్రం ఫైనల్ కాలేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ సినిమా తరువాత చిరుతో చేయబోయే సినిమా వర్క్ మొదలెట్టున్నాడట. అయితే ఇందుకు సంబందించి ఎలాంటి ప్రకటనా లేకపోయినా, అభిమానులు మాత్రం మరోసారి చిరు రీ ఎంట్రీపై చర్చించుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trivikram srinivas  megastar Chiranjeevi  150th movie  

Other Articles

Today on Telugu Wishesh