Anushka in Bala direction

Anushka in bala direction

Anushka in Bala next film, Anushka in Bala film, Anushka in Bala direction, Anushka latest news, Anushka movies, Anushka size zero, Anushka stills, Anushka hot news, Anushka

Anushka in Bala direction: South indian star heroine anushka latest film size zero. this film will be release on 27 november. After bahubali anushka acts in balas next film.

పంచపాండవులతో సైజ్ జీరో భామ రొమాన్స్

Posted: 11/19/2015 09:41 AM IST
Anushka in bala direction

తమిళ దర్శకుడు బాల తీసే సినిమాలన్నీ కూడా విభిన్నంగా వుంటాయి. కమర్షియల్, రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఓ కొత్త నిజమైన ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పటివరకు బాల తీసిన సినిమాలన్నీ కూడా అలాంటివే. ‘శివపుత్రుడు’, ‘నేను దేవుణ్ణి’, ‘వాడు-వీడు’ వంటి ఎన్నో చిత్రాలు దర్శకుడిగా బాలను ఓ ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

ఇక ‘బాహుబలి’ చిత్రంతో ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన అనుష్క కూడా విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరికొద్ది రోజుల్లో అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇపుడు బాల-అనుష్కల కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోలుగా ఆర్య, విశాల్, రానా, అధర్వ, అరవింద్ స్వామిలు ఎంపిక అయ్యారు. వీరితో పాటు అనుష్క ప్రధాన పాత్రలో నటించనుంది. ఆర్య, విశాల్, రానా, అధర్వలు ఇప్పటికే బాల దర్శకత్వంలో నటించారు. అరవింద్ స్వామి, అనుష్కలతో సినిమా చేయడం బాలకు ఇదే ప్రథమం.

ఈ ప్రాజెక్టుకు అనుష్క ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తారై తప్పట్టై’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Bala  Size zero  Arya  Vishal  stills  

Other Articles