Raj Tarun | RGV | Tweets | Comments

Raj tarun sensational tweets on rgv

Raj Tarun tweets, Raj Tarun comments on rgv, Raj Tarun comments on rgv, RGV Tweets, Raj Tarun RGV Cold War, Raj Tarun latest news, Raj Tarun movies, Raj Tarun stills, Raj Tarun, Ram gopal varma

Raj Tarun Sensational Tweets on RGV: Tollywood young hero Raj Tarun Sensational Tweets on Director Ram Gopal Varma. Raj Tarun latest news, movies, stills, tweets, gallery.

వర్మపైనే సెటైర్లు వేసిన కుర్ర హీరో

Posted: 11/06/2015 06:12 PM IST
Raj tarun sensational tweets on rgv

దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా రాజకీయ నాయకులు, సినీ నటీనటులు, సినిమాలు... ఇలా ఏ అంశాన్ని కూడా వదలకుండా, తన నోటికొచ్చినట్లుగా ట్వీట్లు చేస్తూ అందరి దృష్టిలో ఓ విభిన్న క్యారెక్టర్ పర్సెన్ గా మారిపోయాడు. ఒకప్పుడు వర్మ కామెంట్లకు ఎవరైనా రీ కామెంట్లు చేసేవారు. కానీ ఇపుడు మాత్రం వర్మ కామెంట్లకు కూడా జవాబులు ఇవ్వడం అవసరమా అనే దృష్టిలో వున్నారు జనాలు, సినీ నటీనటులు, రాజకీయ నాయకులు.

కానీ ఉడుకు రక్తం గల యువకులు మాత్రం ఇలా మనకెందుకులే అని ఊరుకోరు కదా! కామెంట్లకు రివర్స్ లో కామెంట్ చేసే వరకు ఊరుకోరు. అలాంటి యువకుల జాబితాల్లోకి యువనటుడు రాజ్ తరుణ్ కూడా చేరాడు. వర్మకు రాజ్ తరుణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’ వంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకెళుతున్న రాజ్ తరుణ్ డైరెక్టర్ వర్మపై తాజాగా తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసారు.

అదేంటంటే... వర్మ సినిమాకు తాను పని చేస్తున్నానని, ఆయన పొరబాట్లను సరిచేయగలననే విషయం తనకు తెలుసని, అందుకే ఆయన జస్ట్ ఓకే ఓకే డైరెక్టర్ అంటూ వర్మపై సెటైరికల్ కామెంట్లు చేసాడు. అంతటితో ఆగకుండా తాను డైరెక్టర్ అయితే రంగీల, శివల కన్నా బెటర్ గా సినిమా చేయగలనంటూ కామెంట్ చేసాడు.

రాజ్ తరుణ్ కామెంట్లపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ... రాజ్ తరుణ్ డైరెక్టర్ అయితే తనకన్నా పూరీ, వినాయక్, రాజమౌళిల కన్నా బెటర్ డైరెక్టర్ అవుతాడు అంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారో లేదో తెలియదు కానీ.. వీరిద్దరి కామెంట్ల వార్ సోషల్ మీడియా జనాలకు మాత్రం ఫన్నీ క్లబ్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  RGV  Tweets  Comments  Stills  

Other Articles