Baahubali2 | Madhuri Dixit | Vijayendra Prasad

Vijayendra prasad clarifies on madhuri dixit in baahubali2

Baahubali writer clarifies on Madhuri Dixit in Baahubali2, Baahubali writer clarifies on Madhuri Dixit, Madhuri Dixit in Baahubali2, Madhuri Dixit exit from baahubali 2, Baahubali2 movie news, Baahubali2 movie updates, Baahubali2 stills, Baahubali2

Vijayendra prasad clarifies on Madhuri Dixit in Baahubali2: Writer Vijayendra prasad clarifies rumors on bollywood actress madhuri dixit acts special role in Baahubali2.

బాహుబలి2లో మాధురీ లేదంటున్న విజయేంద్రప్రసాద్

Posted: 11/04/2015 01:34 PM IST
Vijayendra prasad clarifies on madhuri dixit in baahubali2

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని, రికార్డుల కలెక్షన్లను క్రియేట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

అలాంటి ఈ సినిమా రెండవ భాగం ‘బాహుబలి2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించడానికి చాలా మంది స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆశతో ఎదురుచూస్తున్నారు. గతంలో సూర్య వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కనీసం చిన్న పాత్రలలోనైనా కనిపించడానికి ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. అయితే ‘బాహుబలి2’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీఫుల్ డాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ఓ కీలక పాత్రలో నటించనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలను ‘బాహుబలి’ చిత్ర కథ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఖండించారు. విజయేంద్రప్రసాద్ స్పందిస్తూ... అసలు ఆమెనే తీసుకోవాలనే ఆలోచన కూడా మాకు రాలేదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎవరైతే మీడియాలో ఇలాంటి వార్తలు రాస్తున్నారో.. వారు సినిమా రచయితల కంటే చాలా ఊహాశక్తితో ముందుకు వెళ్తున్నారు అంటూ చమత్కరించారు. త్వరలోనే ‘బాహుబలి2’ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే స్ర్కిప్టు పనుల్లో రాజమౌళి బిజీగా వున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali2  Madhuri Dixit  Vijayendra Prasad  Movie News  stills  

Other Articles