hero nani dream project with director mani ratnam has stopped without any reasons | tollywood news

Telugu hero nani dream project stopped without any reasons

hero nani news, nani updates, nani dream project, nani with mani ratnam, nani mani ratnam updates, hero nani gossips, tollywood gossips, director mani ratnam

telugu hero nani dream project stopped without any reasons : hero nani dream project with director mani ratnam has stopped without any reasons.

నాని డ్రీమ్ ప్రాజెక్ట్ బెడిసికొట్టింది..!

Posted: 10/26/2015 11:07 AM IST
Telugu hero nani dream project stopped without any reasons

‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో ఫుల్ ఫామ్ లోకొచ్చిన హీరో నానికి ఇంతలోనే నిరాశకు గురికావాల్సి వచ్చింది. ఎందుకంటే.. గతకొన్నాళ్ల నుంచి తాను నటించాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కసారిగా ఆగిపోయిందని సమాచారం. ఇండియన్ చిత్రపరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో నటించాలని అనుకున్న నానికి ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడని తెలిసింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? అని అనుకుంటన్నారా! మరెవ్వరో కాదు.. మణిరత్నం.

విభిన్నమైన కథాచిత్రాలను తెరకెక్కించడంలో తనకు తానే సాటిగా పేరుగాంచిన మణిరత్నం సినిమాలో నటించాలని, కనీసం ఓ చిన్న పాత్రలోనైనా కనిపించాలని ప్రతిఒక్కరు ఆశపడుతుంటారు. అలాంటి స్టార్స్ లో టాలీవుడ్ యంగ్ హీరో నాని కూడా ఒకడు. మణిరత్నంతో ఓ సినిమా చేయాలని వుందని ఇప్పటికే నాని చాలా సార్లు తన అభిప్రాయాన్ని బహిరంగంగానే వెల్లడించాడు. అందులో భాగంగానే మొదటగా నానికి ‘ఓకే బంగారం’ సినిమాలో దల్క్వేర్ సల్మాన్ కి డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కింది. ఆ అవకాశంతో మణిరత్నం గత కొద్ది రోజులగా చేయాలనుకుంటున్న ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లో మెయిన్ హీరోగా నటించే అవకాశం నానికి వచ్చింది. మణిరత్నంతో చేయాలనుకున్న డ్రీమ్ నేరవేరబోతుండడంతో నాని కూడా చాలా సంబరపడి ఈ సినిమాకి సైన్ చేసేసాడు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

అయితే.. ఇప్పుడు నాని డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఏమైందో తెలియదు గానీ మణిరత్నం ఈ మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలనే ఆలోచనని పూర్తిగా మానుకున్నాడు. అంతేకాకుండా ధనుష్ తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. దీంతో నాని తన డ్రీమ్ రోజేచ్ట్ మిస్ అయ్యిందని కాస్త బాధలో ఉన్నాడు. నాని ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nani latest updates  director mani ratnam  

Other Articles