ram charan tej showing interesting to learn short term movie script course to select good movies | tollywood news

Ram charan tej showing interesting to learn short term movie script course

ram charan tej, movie script write courses, telugu movies, tollywood news, telugu film industry, ram charan gossips, ram charan controversies, ram charan updates

ram charan tej showing interesting to learn short term movie script course : ram charan tej showing interesting to learn short term movie script course to select good movies which help him to hipe his career graph.

కెరీర్ గ్రాఫ్ హైప్ కోసం చెర్రీ కొత్త ఆలోచన!

Posted: 10/22/2015 02:19 PM IST
Ram charan tej showing interesting to learn short term movie script course

ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలంటే కేవలం నటన, ఫాలోయింగ్ వుంటే సరిపోదు... సరైనా కథాంశంతో కూడిన చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందితేనే ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఈ సూత్రం ప్రతిఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా పసిగట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటిదాకా తన బ్రాండ్ ఇమేజ్‌తో వరుస సినిమాలు చేసుకుంటూపోయిన చెర్రీ.. ప్రస్తుతం టాలీవుడ్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తననితాను మలుచుకుంటున్నట్లు సమాచారం.

ఇటీవల ‘బ్రూస్‌లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చెర్రీకి కాస్త నిరాశే మిగిలింది. ఆ చిత్రం భారీ విజయం సాధిస్తుందని మూవీ యూనిట్‌తోపాటు చెర్రీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ.. యావరేజ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా.. ఈ సినిమా కథ అంతగా ఇంప్రెసివ్‌గా లేదని, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేదని విశ్లేషకులు తేల్చి పారేశారు. అందుకేనేమో.. చెర్రీ ఇప్పుడు స్ర్కిప్ట్ రైటింగ్‌పై దృష్టి పెడుతున్నాడు.  సినిమా స్క్రిప్టుపై పట్టు తెచ్చుకునే క్రమంలో భాగంగా త్వరలో ఓ షార్ట్ టర్మ్ కోర్సు చేయడానికి రెడీ అవుతున్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సుకి హాజరవుతాడట. ఈ విషయాన్ని స్వయంగా తనే వెల్లడించాడు కూడా. అయితే, ఏ దేశంలో ట్రైనింగ్ తీసుకుంటాడన్నది మాత్రం వెల్లడించలేదు. మంచి కథలను ఎంచుకోవడానికి ఈ కోర్సు తనకి ఉపయోగపడుతుందని చరణ్ చెబుతున్నాడు.

ఇదిలావుండగా.. తమిళంలో భారీ విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో చెర్రీ హీరోగా రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని అంతా భావించారు. కానీ.. ఆ చిత్రం మొదలవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిసింది. ఈ ఖాళీ సమయంలో చెర్రీ తన ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్ కోసం త్వరలో లండన్ వెళుతున్నాడు. ఆ ట్రిప్ అయిన వెంటనే స్ర్కిప్ట్ కోర్సులో చేరి, ఆ తర్వాత తన తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తాడని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan news  movie script write courses  

Other Articles