Anushka | Size Zero | Release Postponed

Anushka size zero release postponed

Anushka Size Zero Release Postponed, Anushka Size Zero Latest Posters, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Size Zero Release Postponed: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Size Zero release date postponed.

మళ్లీ వాయిదా పడ్డ అనుష్క ‘సైజ్ జీరో’

Posted: 10/16/2015 01:03 PM IST
Anushka size zero release postponed

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న అందాల భామ అనుష్క.. హ్యట్రిక్ పై కన్నేసింది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి భారీ హిట్ చిత్రాల తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ దసరాకు పలు స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతుండటంతో ‘సైజ్ జీరో’ చిత్రాన్ని వాయిదా వేసారు చిత్ర యూనిట్. కానీ ఈ చిత్ర విడుదల తేదిని తాజాగా లాక్ చేసేసారు. నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500ల థియేటర్లలో విడుదల చేయనున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

తెలుగు, తమిళం భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇందులో అనుష్క సరసన ఆర్య హీరోగా నటిస్తున్నాడు. సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Release Postponed  Movie News  Arya  

Other Articles