Neelima Guna clarifies on Bruce lee film Issue

Neelima guna clarifies on bruce lee film issue

Producer Neelima Guna clarifies on Bruce lee Issue, Producer Neelima Guna clarifies on Bruce lee, Producer Neelima Guna interviews, Producer Neelima Guna latest news, Producer Neelima Guna, Rudhramadevi movie news, Rudhramadevi movie collections, Rudhramadevi latest reports, Rudhramadevi stills, Ram charan, Bruce lee the fighter

Neelima Guna clarifies on Bruce lee film Issue: Director Guna shekhar wife, Producer Neelima Guna clarifies on Mega Powerstar Ram charan`s Bruce lee the fighter movie release Issue.

గమ్మునుండవోయ్... మేమే అడగలేం... మీకెందుకు కంగారు!

Posted: 10/13/2015 01:26 PM IST
Neelima guna clarifies on bruce lee film issue

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం ఈ అక్టోబర్ 16వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. దీనివల్ల మిగతా చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడుతోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందించిన ‘రుద్రమదేవి’ చిత్రం గతవారం అక్టోబర్ 9వ తేదిన విడుదలయ్యింది.

ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఇలాంటి చిత్రం కోసం ‘బ్రూస్ లీ’ విడుదలను మరికొద్ది రోజులు వాయిదా వేయాలంటూ కొద్దిరోజుల నుంచి పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రాంచరణ్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసాడు. ‘బ్రూస్ లీ’ వాయిదా గురించి తమను ‘రుద్రమదేవి’ యూనిట్ ఎవరూ కలవలేరని చరణ్ స్పష్టం చేసాడు.

కానీ ఈ విషయంపై ఇంకా అనవసరమైన కామెంట్లు వినిపిస్తూనే వుండటంతో ‘రుద్రమదేవి’ చిత్ర నిర్మాత నీలిమ గుణ ఓ క్లారిటీ ఇచ్చేసారు. ‘బ్రూస్ లీ’ సినిమాను వాయిదా వేయాలనీ తాము ఎవరినీ అడగలేదని, ఈ విషయంలో మెగా అభిమానులు అనవసర రాద్దాంతం చేయోద్దని ఆమె చెప్పుకొచ్చారు.

మొత్తానికి ‘రుద్రమదేవి’ చిత్ర యూనిట్ కు ‘బ్రూస్ లీ’ విడుదలపై ఎలాంటి కంగారు లేదని అర్థమవుతోంది. మరి ‘రుద్రమదేవి’ నిర్మాతలకే లేని కంగారు మిగతావాళ్లకు ఎందుకో అర్థం కావడం లేదు. ఇదంతా మెగా ఫ్యామిలీ అంటే గిట్టనివాళ్లే చేస్తున్నారంటూ మెగా అభిమానులు  చెబుతున్నారు. ఏదేమైనా ‘బ్రూస్ లీ’ అక్టోబర్ 16న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neelima Guna  clarifies  Bruce lee Issue  Rudhramadevi  Ram Charan  

Other Articles