Sudeep Says Divorce from Priya Won't Affect his Relationship with Daughter Saanvi

My daughter is my priority says hero sudeep

sudeep kumar, kannada star, sandalwood hero, daughter saanvi, Priya, sudeep,priya radhakrishnan,Sudeep daughter Saanvi,Sudeep divorce wife Priya,Sudeep wife Priya,Kannada actor Sudeep,Kichcha Sudeep breakup,Kicha Sudeep priya split, priya radhakrishnan, sudeep priya radhakrishnan, sudeep divorce, sudeep priya radhakrishnan divorce, sudeep news, entertainment news

Kannada actor Kichcha Sudeep, who is parting ways with wife Priya Radhakrishnan, says he loves his daughter Saanvi very much and the divorce will not affect his relationship with her.

ఆమె నా పంచ ప్రాణాలు.. సుదీప్

Posted: 09/13/2015 09:04 PM IST
My daughter is my priority says hero sudeep

అమె నా పంచ ప్రాణాలు.. అమె నాకు ప్రత్యేకం... ఆమెకే నా మొదటి ప్రాధాన్యం ... ఆమెను విపరీతంగా ప్రేమిస్తాను ... అని 11 ఏళ్ల తన గారాల పట్టి, కుమార్తె శాన్వీ గురించి ప్రముఖ నటుడు సుదీప్ తెలిపారు. ప్రియా, తాను విడాకులు తీసుకున్నా శాన్వీతో తన అనుబంధంలో మార్పు ఉండదని  ఆయన స్పష్టం చేశారు. తన సతీమణి ప్రియాతో 14 ఏళ్ల అనుభంధాన్ని తెంచుకుంటున్న సందర్భంగా స్పందించిన ఆయన.. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకుగాను తాను తన సతీమణికి 19 కోట్ల రూపాయల భరణం కూడా ఇస్తున్నట్లు చెప్పుకోచ్చారు. కేరళకు చెందిన ప్రియా తాను ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ అని..తాను బ్యాంక్లో ఉద్యోగం చేస్తుందని కూడా చెప్పుకోచ్చారు.. తమది ప్రేమ వివాహమని, ఇరువైపులా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామన్నాడు. 2004లో వీరికి శాన్వీ జన్మించింది. మొదట్లో సుదీప్ ఇబ్బందులు పడ్డా... ఆ తర్వాత పుంజుకున్నారు. ఇటీవల వరుస సినిమాల ఆఫర్లు వస్తుండటంతో సుదీప్ తెగ బిజీ అయ్యారు.

అయితే 2009 - 10లో సుదీప్పై వుకార్లు వెల్లువెత్తాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రియా కుమార్తె శాన్వీతో కలసి బెంగుళూరులోని జేపీ నగర్లో సర్జాపుర్ రహదారి సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సుదీప్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ ప్రియా ఈ ఏడాది ఆగస్టులో కోర్టును ఆశ్రయించింది. ఇద్దరి అంగీకారంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. శాన్వీ మైనర్ కాబట్టి ఆమె బాధ్యతులు తల్లి ప్రియా చూసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే విడాకులు నేపథ్యంలో ప్రియకు రూ. 19 కోట్ల రూపాయిలు భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ ఒప్పుకున్నాడు. భరణంపై సుదీప్ను విలేకర్లు ప్రశ్నించారు. నేను చేస్తున్నదంతా నా కుమార్తె... నా భార్య కోసమే కాదా అని సింపుల్గా సుదీప్ చెప్పేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sudeep kumar  kannada star  sandalwood hero  daughter saanvi  Priya  

Other Articles