Exclusive: Superstar ready to act with Power star!

Pawan kalyan and mahesh babu multistarrer

Superstar Mahesh Babu,Srimanthudu,pawan kalyan,SS Rajamouli,Mahesh Babu's interaction with Twitter fans,Srimanthudu movie promotion,Mahesh Pawan Kalyan multi-starrer film,James Bond kind of movie,Mahesh SS Rajamouli movie,director Koratala Siva,superstar

Superstar Mahesh Babu has said yes to do a multi-starrer movie with Power Star Pawan Kalyan.

పవన్ కల్యాన్, మహేష్ బాబుల కలయికతో మల్టీస్టారర్ చిత్రం..?

Posted: 08/02/2015 11:53 PM IST
Pawan kalyan and mahesh babu multistarrer

టాలీవుడ్ లో మరో మల్టీ స్తారర్ చిత్రవ రానుందా..? అది అలాంటిలాంటి మల్టీస్టారర్ కాదు.. ప్రస్తుతం మంచి సక్సెస్ రేంజ్ లో కొనసాగుతూ.. రికార్డులను తిరగరాసే పనిలో వున్న ఇద్దరు అగ్రతారలు కలిసి నటించే చిత్రం రానుందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటారా..? చాలా కాలం తర్వాత అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌తో కలిసి ‘సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో భారీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో అగ్ర హీరో తో కలసి నటించేందుకు సముఖత వ్యక్తం చేయడమే ఇందుకు దోహదం చేస్తుంది.
 
బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమా బాక్సాఫీసు వద్ద తెలుగు సినిమా సత్తా తెలిసిపోయింది. నాలుగు వారాల్లో మునుపెన్నడూ లేని కలెక్షన్లను రాబట్టి.. రికార్డులను మోత మ్రోగిస్తుంది. ఈ తరుణంలో పవన్-మహేశ్, చరణ్-ఎన్టీఆర్, బన్నీ-ప్రభాస్ వంటి స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. ఇదే ప్రశ్న సూపర్ మహే‌శ్‌కు ఎదురైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించడానికి మీరు సిద్ధమేనా? అనే ప్రశ్న ట్విట్టర్‌లో మహేశ్‌కు ఎదురైంది. దీనికి స్పందించిన మహేశ్.. ‘వై నాట్?’ అని బదులిచ్చాడు.

ఈ కాంబినేషన్ కాని తెరకెక్కితే అది కచ్చితంగా మంచి క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. ‘బాహుబలి’ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం కూడా పెద్ద కష్టం కాదు. ఇది వరకు పవన్ సినిమా జల్సాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకుడెవరనేది మాత్రం పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా పవన్-మహేశ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే ఈ స్టార్ హీరోలిద్దరి అభిమానులకూ పండగే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Pawan Kalyan  multistarrer.movie  

Other Articles