సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగింటి భార్యభర్తల మధ్య పేచీ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన దర్శకత్వం నుంచి రూపోందిన తాజా సినిమా 'మొగలిపువ్వు' చిత్రానికి తగిలించిన ట్యాగ్ లైన్ ఈ పేచీకి కారణం కానుంది అదేంటంటారా..? ప్రతి పెళ్లైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్లుంటాయ్ అంటూ ఆయన వేసిన ట్యాగ్ కు ఎందరు భార్యభర్తల మధ్య పేచీ మొదలవుతుందో. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం మొగలిపువ్వు.. రొమాన్సు, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరక్కించానన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆయన ఇవాళ విడుదల చేశారు. ఈ టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'రగులుతోంది మొగలి పొద' నుంచి కాపీ కొట్టానని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రతి పెళ్లైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్లుంటాయ్ అంటూ పోస్టర్ పై ముద్రించారు. దీనికి వివరణ కూడా ఇచ్చారు.
'ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు. ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటి నుంచీ వున్నాయి. కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటి నుంచి అవి ఒక భయంకర స్థితికొచ్చేశాయి. టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యాచారాల పరంపరను అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే మొగలిపువ్వు' అని వర్మ తెలిపారు. ఇప్పటివరకు అండర్ వరల్డ్, హారర్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు వివాహ సంబంధాల నేపథ్యంలో చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒక జంట భావోద్వేగాల ఆధారంగా ఆయన తెరకెక్కించిన ‘365 డేస్’ త్వరలో విడుదల కానుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more