Allu arjun next movie with vijay kumar konda

Vijay Kumar Koda movie, Vijay Kumar Koda Allu Arjun movie, Vijay Kumar Koda updates, Vijay Kumar Koda next movie, Vijay Kumar Koda to direct Allu Arjun movie, Allu Arjun next movie, Allu Arjun trivikram movie, Allu Arjun Wallpapers, tollywood Updates, Upcoming telugu movies

Allu Arjun next movie with Vijay Kumar Konda : latest update that Stylish star Allu Arjun may do Vijay Kumar Konda movie soon. Presently bunny working with Trivikram Srinivas after this project he will enter into vijay kumar movie

బన్నీ కొత్త లవర్ ఎవరు..?

Posted: 01/17/2015 12:51 PM IST
Allu arjun next movie with vijay kumar konda

నితిన్ సెకండ్ ఆఫ్ లో మర్చిపోలేని హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండాకు బంపర్ ఆఫర్ వచ్చింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి సినిమాలు తెరకెక్కించి హిట్లు కొట్టిన డైరెక్టర్ త్వరలోనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఫిలింనగర్ వర్గాల టాక్ ప్రకారం బన్నీని కలిసిన విజయ్, కథ చెప్పగా.., స్టైలిష్ స్టార్ చాలా ఇంప్రెస్ అయ్యాడట. స్క్రిప్టు పూర్తిగా రెడి చేసుకో.., ఈ స్టోరీ మనం చేద్దాం అని ఓకే చెప్పేసాడట. దీంతో అర్జున్ కోసం కథ సిద్దం చేసే పనిలో ఉన్నాడు.

విజయ్ కుమార్ కొండా గతంలో తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీలే కావటంతో ఈ మూవీ కూడా లవ్ రెసిపీతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. గతంలో బన్నీ లవర్ బాయ్ గా చాలా సినిమాల్లో నటించాడు. అయితే కథను కాస్త కొత్తగా చూపించే విజయ్ ఏం ప్రయోగం చేస్తాడా, బన్నీని ఎలా తెరపై చూపిస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక బన్నీ లవర్ గా అంటే.., కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో ఇంకా తెలియదు. ప్రస్తుతం ఇండస్ర్టీలో టాప్ ప్లేస్ లో ఉన్న అదా శర్మ లేదా రకుల్ ప్రీత్, కాదంటే మరొకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే పూర్తి కానుంది. సమంత, అదా శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, నటి స్నేహ కూడా స్పెషల్ రోల్స్ లో కన్పించనున్నారు. ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.., విజయ్ కొండా మూవీ షూటింగ్ ను అర్జున్ మొదలు పెడతారని సన్నిహితులు చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Allu Arjun  Vijay Kumar Konda  Trivikram Srinivas  

Other Articles