Samantha next movie dhanush

samantha next movie, samantha dhanush movie, dhanush next movie with samantha, dhanush upcoming movies, samantha telugu movies, samantha tamil movies, samantha latest updates, upcoming telugu movies, upcoming tamil movies, samantha latest photos, samantha latest wallpapers

samantha next movie dhanush : chennai girl samantha signs again a tamil movie after kaththi record hit. sam next movie with dhanush going to shoot soon.

బీటెక్ బాబుతో చెన్నై చిన్నదాని చిందుల్

Posted: 12/27/2014 10:26 AM IST
Samantha next movie dhanush

అమ్మగారింట్లో తప్ప అన్ని చోట్లా అదృష్టం పలికిన సమంతకు.., ఇఫ్పుడు అక్కడా మంచి రోజులొస్తున్నాయి. త్వరలో ఈ అమ్మడు తమిళ స్టార్ ధనుష్ సినిమాలో నటించనుంది. తన సినిమాలో హీరోయిన్ గా సమంత సైన్ చేసింది అని స్వయంగా ధనుష్ ప్రకటించాడు. ‘వెల్లై ఇళ్ళ పట్టతారి (వీఐపీ)’ సినిమా హిట్ తర్వాత ధనుస్ సేమ్ టీమ్ తో తెరకెక్కనున్న కొత్త సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వేళ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు రవిచందర్ సంగీతం అందించనున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేళ్ళయి పట్టతారి’ సినిమాను తెలుగులో రఘువరన్ బీ.టెక్ గా డబ్ చేసి జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ మద్యే తెలుగు వర్షన్ పాటలు కూడా విడుదల అయ్యాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన తన సినిమా తెలుగులో కూడా బాగా ఆడుతుందని ధనుష్ ఆశిస్తున్నాడు. విడుదలకు వారం రోజులు కూడా సమయం లేకపోయినా.., మూవీ ప్రమోషన్లు మాత్రం అంతగా లేవు.

సమంత విషయానికి వస్తే.., తెలుగులో అల్లు అర్జున్ సినిమాలో అమ్మడు నటిస్తోంది. అంతేకాకుండా.., తమిళంలో విక్రమ్ సరసన ‘10 ఎన్రదుకుళ్ళ’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్ అయిన సమంతకు మొదట తమిళంలో పెద్దగా ఆఫర్లు రాలేదు. అంతేకాకుండా ఆమెచేసిన సినిమాలు కూడా ప్లాప్ కావటంతో అవకాశాలు తగ్గాయి. విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి’ హిట్ కావటంతో మళ్ళీ పుట్టింటి నుంచి పిలుపు వస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha movies  dhanush next movie  kollywood  

Other Articles