Sunil vasu varma movie latest update

sunil vasu varma movie update, sunil movies latest updates, hero sunil latest movies, sunil gopi mohan movie updates, tollywood latest news updates, gopi mohan dialogues

sunil vasu varma movie latest update : hero turned comedian sunil latest movie with vasu varma shooting is on progress. sunil ready to act in gopi mohan flick after vasu varma movie shooting completed

ఎక్కడున్నావు రాజా ఇన్నాళ్లు

Posted: 12/06/2014 12:19 PM IST
Sunil vasu varma movie latest update

కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సునీల్.., అనుకోకుండా హీరో అయ్యాడు. తొలి చిత్రం హిట్ కావటంతో ఇక దశ తిరిగింది అనుకున్నాడు.., కాని ఆయన ఊహలు తిరగబడ్డాయి. ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ‘అప్పల్రాజు’, ‘మిస్టర్ పెళ్లి కొడుకు’, ‘భీమవరం బుల్లోడు’ వరుసగా బెడిసి కొట్టడంతో డైలమాలో పడ్డట్లు కన్పించింది. కాని ఇండస్ర్టీని నమ్ముకున్న సునీల్ ను వాసువర్మ ఆదుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లోనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ పూర్తవుతుందని టాక్ విన్పిస్తోంది.

ఇక వర్మ సినిమా పూర్తికాగానే..., గోపి మోహన్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్టు చేస్తాడట. ఈ సినిమా స్ర్కిప్టు రెడి అయిపోగా.., తుది మెరుగులు దిద్దుతున్నారు. సంక్రాంతి తర్వాత బహుశా పిబ్రవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పార్ట్ నర్ అనిల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక తణికెళ్ల భరణితో కూడా ఓ ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. భరణి గారు చెప్పిన కథను మాజి కమెడియన్ ఓకే చేసినా.., కాస్త డెవలప్ చేస్తే బాగుటుంది అని చెప్పటంతో అది అలా ఆగిపోయిందట. అనుకోకుండా హీరో అయి.., ఎందుకిలా అయ్యాడు అని అభిమానులకు బాధను మిగిల్చిన సునీల్ ఈ సినిమాలతో అయినా కోలుకోవాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil movie update  vasu varma movies  tollywood latest updates  

Other Articles